నా రెండో భార్యవి: 13 ఏళ్లుగా కూతురుపై అత్యాచారం
విక్టోరియా: ఓ యువతి పైన ఆమె సవతి తండ్రి గత పదమూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నాడు. ఆమె లింగమార్పిడి చేయించుకున్న యువతి. పదమూడేళ్లుగా సవతి తండ్రి చేష్టలతో విసిగిపోయిన ఆమె 2015లో అతని చేష్టలను వీడియో తీసి, పోలీసులకు సాక్ష్యాలుగా అందించింది.
ఆమె ఇటీవలే సర్జరీ చేయించుకుంది. మీడియాలో వస్తున్న వార్తల మేరకు... తాను లింగమార్పిడి చేయించుకున్న దాదాపు ఏడాది తర్వాత కూడా తన సవతి తండ్రి.. తనను బలవంతంగా ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడని పోలీసులకు తెలిపింది.
ప్రస్తుతం ఈ విషయం కోర్టు పరిధిలో ఉంది. బాధితురాలి ఫిర్యాదు నేపథ్యంలో విక్టోరియన్ కంట్రీ కోర్టు విచారిస్తోంది. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆధారాలు కూడా చూపించింది. విసిగిపోయిన ఆమె తన తండ్రి తనతో ప్రవర్తిస్తున్న తీరును వీడియోగా తీసి ఆధారాలు ఇచ్చింది.

ఓసారి ఆమె తల్లి బయటకు వెళ్లిన సమయంలో తండ్రి వచ్చి.. నీవు ఆపరేషన్ చేయించుకున్నప్పటికీ అది కావాలని అనుకుంటావని వ్యాఖ్యానించాడు. అంతేకాదు, అత్యాచారం, ముద్దుల విషయాన్ని ఎవరికైనా చెబితే బాగుండదని బెదిరించాడు.
అంతేకాదు, ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే నీ తల్లికి అండగా ఉండనని, ఆర్థికంగా నష్టం చేకూరుస్తానని ఆమెను బెదిరించాడు. నీవు నాకు రెండో భార్య వంటి దానివి అని ఆ సవతి తండ్రి తనతో వ్యాఖ్యానించినట్లుగా బాధితురాలు చెప్పింది.
తనను తన సవతి తండ్రి ఓసారి.. రాత్రి సమయంలో హోటల్‌కు తీసుకు వెళ్లాడని, అక్కడ మనకు హనీమూన్ అని చెప్పాడని చెప్పింది. తన పైన బలవంతంగా శృంగారం జరిపాడని చెప్పింది. లింగమార్పిడి నేపథ్యంలో తాను సెక్స్‌కు పనికి రానని చెప్పినప్పటికీ బలవంతం చేశాడని చెప్పింది.
తన పైన పదమూడేళ్లుగా అత్యాచారం చేస్తున్నట్లు చెప్పింది. అతని వ్యవహార శైలి తట్టుకోలేక 2015లో తన పట్ల అతను ప్రవర్తిస్తున్న తీరును వీడియో తీయాలని నిర్ణయించుకున్నానని, అతనిని కోర్టుకు లాగాలని నిర్ణయించుకున్నానని చెప్పింది.












Click it and Unblock the Notifications