ఘోరం: కారులో ప్రేమజంట శృంగారం.. కుదుపులకు గేరు మారి..

Posted By:
Subscribe to Oneindia Telugu

వోల్గోగ్రాడ్: ఓ పీఈటీ, అతని గర్ల్ ఫ్రెండ్ అనూహ్య రీతిలో దుర్మరణం పాలైన ఉదంతం వైరల్ గా మారింది. ఈ ఘటన ఆదివారం రష్యాలో చోటు చేసుకుంది. ఈ జంట కారులో శృంగారంలో మునిగి ఉన్న సమయంలో ఈ ఘోరం చోటు చేసుకుంది.

రష్యాలోని వోల్గోగ్రాడ్ ప్రాంతానికి చెందిన ఎవిజనీ చెర్నోవ్(22) ఓ స్కూలులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ గా పనిచేస్తున్నాడు. అతని ప్రియురాలు యానా కర్యుచ్ కోవా(22)తో కలిసి ఆదివారం కారులో విహార యాత్రకు వెళ్లాడు.

Young couple drown after their car rolls into a river as they are having sex in the back seat

వోల్గోగ్రాడ్ నగర శివారులోని ఓ సరస్సు గట్టు మీద కారు ఆపుకుని కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఆ తరువాత ఇద్దరూ కారు వెనుక సీటులోకి చేరి శృంగారంలో మునిగిపోయారు.

న్యూట్రల్ గేరులో ఉన్న కారు.. కుదుపులు కారణంగా గేరు మారి ఒక్కసారిగా సరస్సులోకి దూసుకెళ్లింది. ఊహించని ఈ ప్రమాదానికి ప్రేమికులిద్దరూ షాక్ కు లోనయ్యారు. కారులోంచి బయటపడలేకపోవడంతో ఇద్దరూ నీటమునిగి మరణించారు.

ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. సరస్పులో మునిగిపోయిన కారును బయటికి తీయించారు. కారులోనే విగతజీవులై ఉన్న ప్రేమికులిద్దరి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
An amorous couple died after their off road vehicle rolled into a lake while they had sex , say police.The 22 year olds could not escape from their Russian-made Niva as it sank, and they tragically drowned on the vehicle's back seat. The school physical education teacher and his girlfriend had earlier driven to the lake in Volograd region, but worried relatives later reported them missing when they failed to return. The couple were named as Evgeny Chernov and Yana Kryuchkova. "The car was lifted out of the lake and the bodies of the young people were found on the back seat," said Andrey Fedotov, an official of the Russian Investigative Committee.
Please Wait while comments are loading...