రేప్‌ల నుంచి రక్షణ: వక్షోజాలకు వేడి ఇస్ట్రీ
లండన్: వయస్సు వస్తున్న అమ్మాయిలను కామాంధుల నుంచి రక్షించుకోవడానికి దారుణమైన చర్యలకు పాల్పడుతున్న విషయం వెలుగులోకి వచ్చింది. కేమరూన్, నైజీరియా, దక్షిణాఫ్రికా వంటి దేశాల్లో తమ అమ్మాయిలను రక్షించుకునేందుకు తల్లులు క్రూరమైన పద్ధతులను అవలంభిస్తున్నారు. బాలిక పుష్పావతి కాగానే ఆమె వక్షోజాలను ఇస్త్రీ పెట్టెతో ఐరన్ చేసి అదిమేస్తున్నారు. ఈ విషయాన్ని ఐక్యరాజ్య సమితి నివేదిక బయటపెట్టింది.
వక్షోజాలు పురుషులను ఆకర్షించి అత్యాచారాలకు పాల్పడుతారన్న ఉద్దేశ్యంతో వారు ఆ దుర్మార్గానికి పాల్పడుతున్నారు. బలమైన రాయి, సుత్తి, గరిటె వంటి వస్తువులను నిప్పుల్లో ఎర్రగా కాల్చి వక్షోజాలను కాల్చేస్తున్నారు. సంపన్నులైతే తమ ఆడ పిల్లల ఎద సంపద కాస్తా ఎదుగుతున్నట్లు కనిపించగానే వెంటనే ఆమె ఛాతికి బలమైన ప్లాస్టిక్ బెల్టులను బిగించి అవి పెరగకుండా చూస్తున్నారు.

ఇలా బ్రెస్ట్ ఐరనింగ్ బారిన పడుతున్నవారి సంఖ్య దాదాపు 3.8 మిలియన్లుగా ఉన్నట్లు ఐక్యరాజ్య సమిత గణాంకాలు చెపుతున్నాయి. వీటిని అడ్డుకునేందుకు ఆ మూడు దేశాల్లోనూ ఎలాంటి చట్టాలు లేవు. ఇవి ఎప్పటి నుంచో ఆచారంగా వస్తున్నాయి. బ్రెస్ట్ ఐరనింగ్ కారణంగా పెళ్లయ్యాక తల్లులయ్యే యువతుల్లో పిల్లలకు పాలివ్వడం దుర్లభంగా మారుతోంది.
చాలామందిలో బ్రెస్ట్ ఇన్ఫెక్షన్లు వచ్చి నరకాన్ని చవిచూస్తున్నారు. ఈ దుశ్చర్యను అడ్డుకునేందుకు లండన్‌లోని ‘చారిటీ విమెన్స్ అండ్ గర్ల్స్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్' అవగాహన కార్యక్రమాలను నిర్వహించి అడ్డుకునేందుకు ప్రయత్నం చేస్తోంది.












Click it and Unblock the Notifications