చూయింగ్ గమ్ నమిలితే ఏడాదికి రూ.కోట్లు ఆదా!

లండన్: చూయింగ్ గమ్ నమలడం ముఖానికి మంచి వ్యాయమమని, అది ముఖ ఆకృతిని అందంగా తీర్చిదిద్దుతుందని వ్యాయామ నిపుణులు చెబుతుంటారు. అలాగే చూయింగ్ గమ్ నమలడం వల్ల ఆరోగ్యం కోసం వెచ్చించే సొమ్ము చాలా ఆదా అవుతోందట.

బ్రిటన్‌లోని ప్లిమౌత్ యూనివర్సిటీ నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. బ్రిటన్‌లోని 12 ఏళ్లలోపు వయసు ఉన్న పిల్లలు ఏదైనా ఆహారం తీసుకున్న తర్వాత చూయింగ్ గమ్ నమలడం వల్ల నేషనల్ హెల్త్ సర్వీస్‌కు ఏటా 80 లక్షల పౌండ్లు ఆదా అవుతుందని తేలింది.

ఈ సందర్భంగా చూయింగ్ గమ్ నమలడం వల్ల చేకూరే ప్రయోజనాలను ప్లిమౌత్ యూనివర్శిటీ పరిశోధకులు ప్రస్తావించారు. ఏదైనా తిన్న తర్వాత లేదా తాగిన తర్వాత షుగర్ లెస్ చూయింగ్ గమ్‌ను నమలడం వల్ల ఉమ్మి ఉత్పత్తి అవుతుందని, పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలను తొలగించేందుకు సహకరిస్తుందన్నారు.

Youngsters chewing sugar free gum could save NHS £8m a year

పళ్లను బలహీనపరిచే ప్లేక్ యాసిడ్స్‌ను క్రమబద్ధీకరించేందుకు, దంత సంరక్షణకు చూయింగ్ గమ్ ఉపయోగపడుతుందన్నారు. పళ్లను ఆరోగ్యంగా ఉంచుకోవడానికి చూయింగ్ గమ్ నమలడం కంటే మించిన సులభమైన మార్గం మరొకటి లేదని ఈ అధ్యయనానికి సారథ్యం వహించిన ప్రొఫెసర్ లిజ్ కె స్పష్టం చేశారు.

12 ఏళ్లలోపు పిల్లలు రోజుకు ఒక షుగర్ ఫ్రీ చూయింగ్ గమ్ నమిలితే ఎన్‌హెచ్ఎస్‌కు ఏడాదికి రూ.27 కోట్లా ఆదా అవుతోందని, అదే రోజుకు రెండు చూయింగ్ గమ్‌లు తీసుకుంటే రూ.32 కోట్లు, 3 చూయింగ్ గమ్‌లు తీసుకుంటే రూ.80 కోట్లు ఆదా చేయవచ్చునని తెలిపారు. 12 ఏళ్ల లోపు పిల్లలకే కాకుండా మిగతా వారికి వర్తింప చేస్తే ఈ సొమ్ము మరింత ఎక్కువ ఆదా అవుతుందన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+