యూట్యూబ్ మోస్ట్ వైరల్ వీడియో-2017: 180మిలియన్ల పైచిలుకు వ్యూస్..

Subscribe to Oneindia Telugu

బ్యాంకాక్: 2017సంవత్సరం చరమాంకానికి చేరుకోవడంతో.. ఈ ఏడాది జరిగిన వింతలు, విశేషాలపై ప్రస్తుతం అందరి దృష్టి నిలిచింది. దానికి తగ్గట్లే ఆయా సంస్థలు ఆయా రంగాల్లో ర్యాంకింగ్స్ విడుదల చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ది బెస్ట్ వర్క్ ప్లేస్ 'ఫేస్ బుక్': యాపిల్ అత్యంత చెత్త అన్న గ్లాస్‌డోర్ సీఈవో..

ఇప్పటికే గ్లాస్ డోర్ వంటి అమెరికన్ సంస్థ ది బెస్ట్ వర్క్ ప్లేస్ పేరుతో 2016-2017సంవత్సరానికి గాను ర్యాంకులు ప్రకటించగా.. తాజాగా యూట్యూబ్ సైతం టాప్ మోస్ట్ పాపులర్ వీడియోల జాబితాను వెల్లడించింది. థాయిలాండ్ రియాలిటీ షోకు సంబంధించిన 'ది మాస్క్ సింగర్' అనే వీడియోకు ఈ ఏడాది అత్యధిక వ్యూస్ వచ్చినట్లు యూట్యూబ్ తెలిపింది.

ఈ వీడియోకు 182 మిలియన్ పైచిలుకు వ్యూస్ రావడం విశేషం.జనవరి 25న మాస్క్ సింగర్ వీడియో యూట్యూబ్‌లో అప్ లోడ్ అయినట్లు సమాచారం. మాస్క్ సింగర్ తర్వాత షేప్ ఆఫ్ యూ(కైల్ హనగామి కొరియోగ్రఫీ), పింగ్ పాంగ్ ట్రిక్ షాట్స్ 3, లేడీ గాగా ఫుల్ పెప్సీ జీరో షుగర్ సూపర్ బౌల్, వంటి వీడియోలు టాప్ లిస్టులో చోటు సంపాదించాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
It's YouTube's roundup of the top trending videos of the year, and in 2017 a non-US video hit No. 1 on the chart.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

X