ఇది నిజం: 4ఎకరాల్లో సొంత దేశం నిర్మించుకున్న వ్యక్తి

న్యూయార్క్: న్యూయార్క్‌కు చెందిన ఓ వ్యక్తి నాలుగు ఎకరాల పొలంలో సొంత దేశాన్ని నిర్మించుకున్నాడు. దానికి జకిస్తాన్ అని పేరు కూడా పెట్టుకున్నాడు. తన సొంత దేశానికి అతను ఓ జాతీయ పతాకం రూపొందించుకున్నాడు.

జక్‌ లాండ్స్‌బర్గ్‌ అనే వ్యక్తి ఉటా ప్రాంతంలోని నాలుగెకరాల స్థలంలో తన సొంత దేశాన్ని నిర్మించుకున్నాడు. ఆయన నాలుగెకరాల స్థలం కొనుక్కుని దానికి 'జకిస్థాన్‌' అని నామకరణం చేశాడు. నాలుగెకరాల జకిస్తాన్‌ దేశాన్ని 24 గంటలూ కాపలా కాసేందుకు ఓ రోబోను ఏర్పాటు చేసుకున్నాడు.

Zaqistan: Man builds own 'country'

ఎవరైనా సరే తన దేశం పరిధిలోకి రావాలంటే అధికారిక పాస్‌పోర్టులు ఉండాలని స్పష్టం చేశాడు..రోబో సెంట్రీ అనుమతించి లోపలికి రాగానే అధికారికంగా పాస్‌పోర్టుల స్టాంపింగ్‌ కూడా అయిపోతుందని ఓ టీవీ ఛానల్‌ వెల్లడించింది. తన దేశానికి ఓ నినాదాన్ని సృష్టించుకున్నాడు.

శూన్యం నుంచి ఎంతో కొంత... అనే నినాదాన్ని తన జకిస్తాన్ దేశానికి పెట్టుకున్నాడు. తనది చట్టపరంగా చెల్లుబాటయ్యే దేశం కాదని తెలుసనీ చెప్పాడు. అయితే, ఓ రకమైన సృజనతో కూడిన కళాత్మక పథకంగా తాను దీనిని భావిస్తున్నానన్నాడు. అయితే, ఓ దేశంగా తాను ఈ నాలుగెకరాల ప్రదేశానికి సార్వభౌమాధికారాన్ని ఎంత మేరకు సాధించగలనో చూసుకోవాలని ఉందన్నాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+