పుతిన్ తో భేటీ వేళ.. జెలెన్‌స్కీకి మోదీ కీలక హామీ.. ఏం చెప్పారంటే..?

రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడున్నరేళ్లకు పైగా యుద్దం కొనసాగుతూనే ఉంది. ఆగస్టు 28 న ఉక్రెయిన్ రాజధాని కీవ్‌ పై రష్యా మరోసారి డ్రోన్లతో దాడికి పాల్పడింది. 598 డ్రోన్లు, 31 తేలికపాటి క్షిపణులతో కీవ్ నగరంపై విరుచుకుపడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్‌ వర్గాలు ప్రకటించాయి. ఈ దాడుల్లో 12 మంది మృతి చెందినట్లు తెలిపాయి. ఉక్రెయిన్ పై మరోసారి భీకర దాడికి రష్యా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌ స్కీ ప్రధాని నరేంద్ర మోదీతో ఫోన్‌ లో మాట్లాడారు. రష్యా యుద్ధం తీరును ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు మోదీకి జెలెన్ స్కీ వివరించారు. ప్రధాని మోదీ సైతం ఉక్రెయిన్ కు పూర్తి మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. ఉక్రెయిన్ లో శాంతిని నెలకొల్పేందుకు తమవంతు కృషి చేస్తామని ప్రధాని మోదీ.. జెలెన్ స్కీకు హామీ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోదీ చైనా పర్యటనలో ఉన్నారు. జపాన్ లో పర్యటన అనంతరం ఆయన చైనా చేరుకున్నారు. ఆగస్టు 31, సెప్టెంబర్ 1వ తేదీల్లో తియాంజిన్ వేదికగా జరిగే షాంఘై సహకార సంస్థ శిఖరాగ్ర సదస్సు (SCO)లో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో భాగంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌ పింగ్‌, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ సహా పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. ఈ క్రమంలో ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్ లో సంభాషించారు. రష్యా- ఉక్రెయిన్ యుద్ధం, పరిణామాలను ప్రధాని మోదీకి వివరించారు. రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు ప్రధాని మోదీకి జెలెన్ స్కీ వివరించారు.

ఈ క్రమంలో ఉక్రెయిన్ అధ్యక్షుడికి ప్రధాని మోదీ కీలక హామీ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య శాంతి స్థాపనకు భారత్ కట్టుబడి ఉందని పునరుద్ఘాటించారు. శాంతియుత మార్గంలోనే ఇరు దేశాల మధ్య సంక్షోభాన్ని పరిష్కరించుకోవాలన్న భారత్‌ వైఖరిని మరోసారి స్పష్టం చేశారు ప్రధాని మోదీ. జెలెన్ స్కీ- మోదీ సంభాషణ వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం వెల్లడించింది. భారత్‌- ఉక్రెయిన్‌ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు ఇరు దేశాల నేతలు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది.

Zelensky Reaches Out to Modi Amid Putin Meeting Urges Peace Efforts

ప్రధాని మోదీతో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ ఫోన్ లో సంభాషించడం ఆగస్టు నెలలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇదివరకు ఆగస్టు 11న వీరిద్దరూ ఫోన్‌ లో చర్చించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, రష్యా అధినేత పుతిన్‌ ల మధ్య భేటీకి ముందు ఈ సంభాషణ జరిగింది. తాజాగా SCO సమావేశంలో భాగంగా పుతిన్‌ తో మోదీ భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇరు దేశాల నేతల మధ్య సంభాషణ జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+