జెలెన్ స్కీను మాస్కోకు ఆహ్వానించిన రష్యా.. భద్రతకు హామీ..
రష్యా- ఉక్రెయిన్ మధ్య మూడేళ్లకు పైగా యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల యూఏఈలో జనవరి 23-24 తేదీల్లో అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరిగింది. ఇదే సమావేశంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య ముడేళ్లకుపైగా కొనసాగుతున్న యుద్ధం ముగియాలని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో శాంతి చర్చల కోసం ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీను రష్యా ఆహ్వానించింది. ఈ మేరకు జెలెన్ స్కీ భద్రతకు హామీ ఇచ్చింది.
రష్యా- ఉక్రెయిన్ ల మధ్య మూడున్నరేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు ఇరు దేశాలు సమాయత్తం అయినట్లు తెలుస్తోంది. తాజాగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీను రష్యా ఆహ్వానించింది. ఈ విషయాన్ని రష్యా అధ్యక్ష భవనం క్రిమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ వెల్లడించారు. ఇటీవల అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరిగిన నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడ్ని రష్యా ఆహ్వానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇక జెలెన్ స్కీ భద్రతపై తాము హామీ ఇస్తున్నట్లు రష్యా స్పష్టం చేసింది. ఉక్రెయిన్ తో శాంతి చర్చలు జరిపేందుకు రష్యా ఆసక్తిగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇదే విషయంపై పుతిన్ సన్నిహితుడు యూరీ ఉషాకోవ్ మాట్లాడుతూ జెలెన్ స్కీను రష్యా ఆహ్వానించిందని.. ఒకవేళ అతడు సమావేశానికి సిద్ధమైతేనే అని స్పష్టం చేశారు.

ఇక 2022 ఫిబ్రవరిలో రష్యా- ఉక్రెయిన్ మధ్య మొదలైన యుద్ధం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపేందుకు ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికా, రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య తొలి త్రైపాక్షిక సమావేశం జరిగింది. యుద్ధం ఆపేసే ప్రయత్నాలపై చర్చించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి జెలెన్ స్కీకు ఆహ్వానం అందడం ప్రాధాన్యత సంతరించుకుంది.












Click it and Unblock the Notifications