లైంగిక చర్యతోనూ ‘జికా’ వ్యాప్తి: టెక్సాస్‌లో తొలి కేసు

మియామి: ఉత్తర, దక్షిణ అమెరికాలను జికా వైరస్ హడలెత్తిస్తోంది. కాగా, ప్రమాదకరంగా వ్యాపిస్తున్న ఈ జికా వైరస్‌ లైంగిక చర్య ద్వారా కూడా వ్యాప్తి చెందుతోంది. అమెరికాలోని టెక్సాస్‌లో ఈ విధంగా జికా సోకిన తొలి కేసు నమోదైంది.

గర్భంతో ఉన్న మహిళలకు జికా వైరస్‌ సోకితే చిన్నారులు తల తక్కువ పరిమాణంతో, మెదడు సంబంధ లోపాలతో జన్మిస్తున్నారు. ఈ వైరస్‌ దోమల ద్వారా కూడా వ్యాపిస్తుంది. వైరస్‌ సోకిన వారితో లైంగికచర్య ద్వారా కూడా జికా వైరస్‌ సోకుతుందని తాజాగా టెక్సాస్‌ ఆరోగ్య విభాగం స్పష్టం చేసింది.

ప్రమాదకరమైన ఈ వైరస్‌ ఎక్కువగా లాటిన్‌ అమెరికా ప్రాంతంలో వ్యాపించింది. ఇప్పుడిప్పుడే మిగతా ప్రాంతాలకు పాకుతోంది. జికా ప్రభావిత ప్రాంతాలల్లో పర్యటించవద్దని గర్భిణిలకు సూచిస్తున్నారు.

Zika has been sexually transmitted in Texas, CDC confirms

కాగా, ఈ ఏడాది బ్రెజిల్ లోని రియోడిజనీరోలో సమ్మర్ ఒలింపిక్స్ జరగున్నాయి. అయితే, గర్భిణులు ఒలింపిక్ గేమ్స్ చూసేందుకు బ్రెజిల్ రావద్దని ఆ దేశ క్యాబినెట్ చీఫ్ జాక్వెస్ వాంగెర్ హెచ్చరించారు.

అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ నిర్ణయం మేరకు ఉన్నతాధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. జికా వైరస్ గర్భిణులకు వ్యాపించినట్లయితే వారికి పుట్టబోయే పిల్లలు చిన్న తలతో పుట్టడం, ఇతర ప్రమాదకర వ్యాధులు చిన్నారులకు సంక్రమిస్తాయని తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+