అంతా 'ఫేక్': ఆ అమ్మాయి లక్షణంగా ఉంది.. అసలు నిజం చెప్పిన ఏంజెలినా ఫ్యాన్!

Subscribe to Oneindia Telugu

టెహ్రాన్: అభిమానం ఇంత పిచ్చి పని చేయిస్తుందా? అని ప్రతీ ఒక్కరూ ముక్కున వేలేసుకునేలా చేసిన 'సహర్ తబర్'.. మరో పెద్ద షాక్ ఇచ్చింది. అసలు ఆ ఫోటోలన్ని ఫేక్ అని చెప్పి.. ఇప్పుడు అసలు పిచ్చోళ్లు ఎవరో గుర్తుచేసింది.

అభిమానం ఇంత పని చేయిస్తుందా?: ఏంజెలీనా ఫ్యాన్ ఎంత దాకా వెళ్లిందంటే..

తానేదో సరదా కోసం ఫోటో షాప్ ద్వారా ఎడిట్ చేసిన ఫోటోల్ని తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసుకున్నానని తెలిపింది. 'ఏంజెలినా జోలీలా కనిపించాలన్న ఉద్దేశం నాకు లేదు, నేను పోస్టు చేసిన ఫోటోలు నా ఒరిజినల్ కావు. ఇది నన్ను ఫాలో అవుతున్న అభిమానులకు తెలుసు' అంటూ చెప్పుకొచ్చింది. రష్యన్ మీడియా స్పుత్నిక్‌తో ఆమె ఈ విషయాలు వెల్లడించింది.

Zombie' lookalike of Angelina Jolie admits she lied about plastic surgery to amuse herself

సహర్ తబర్(19) క్లారిటీ ఇవ్వడంతో అంతర్జాతీయ మీడియాపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్పష్టమైన ఆధారలేవి లేకుండా ఇలాంటి వార్తలను ఎలా పబ్లిష్ చేస్తారని నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.

Zombie' lookalike of Angelina Jolie admits she lied about plastic surgery to amuse herself

గత అక్టోబర్‌లో ఆమె తన ఇన్ స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఫోటోలే ఆమె ఒరిజినల్ అని తెలుస్తున్నాయి. తబర్ వివరణతో 'ముఖానికి యాభై సర్జరీలు, కఠిన ఆహార నియమాలతో 40కేజీలకు బరువు మించకపోవడం' వంటివన్ని ఫేక్ అని తేలిపోయింది.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Last week, pictures of 19-year-old Sahar Tabar from Iran went viral after it was reported that she underwent a whopping 50 surgeries to look like Angelina Jolie.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి