ప్రతి ఫేస్ బుక్ ఖాతాతో ఏటా $16,కెనడా,అమెరికా నుండే ఎక్కువ, ఎందుకంటే?
ఫేస్ బుక్ ఖాతాల ద్వారా సగటున ఏడాదికి జుకెన్ బర్గ్ సుమారు 16 డాలర్లను సంపాదిస్తున్నాడు. కెనడా,అమెరికా దేశాల నుండి ఆయనకు ఎక్కువగా డబ్బులు వస్తున్నాయి.
వాషింగ్టన్:ఫేస్ బుక్ .అనతికాలంలోనే ఇది చాలా ప్రఖ్యాతి చెందింది. ఫేస్ బుక్ ఖాతా లేకపోతే విచిత్రంగా చూసే రోజులివి.అయితే ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు ప్రతి ఒక్క ఖాతాదారుడి ద్వారా ప్రతి ఏటా సగటున 16 డాలర్లను సంపాదిస్తున్నారు.
ఫేస్ బుక్ అంటే తెలియనివారుండరు. అనతికాలంలోనే ఫేస్ బుక్ ప్రాచుర్యం పొందింది. ఫేస్ బుక్ లో ఖాతా లేని వారిని విచిత్రంగా చూసే రోజులివి.అయితే ఫేస్ బుక్ ద్వారా స్నేహితులు, ఒకే రకమైన అభిప్రాయాలు కలిగిన ఉన్నవారు గ్రూపులుగా ఏర్పడడం కోసం ఫేస్ బుక్ సౌకర్యాలను కల్పించింది.
ఫేస్ బుక్ ను రోజులో ఒక్కసారైనా ఉపయోగించకుండా ఉండనివారుండరంటే అతిశయోక్తికాదు. ఫేస్ బుక్ మనిషి జీవితంతో విడదీయరాని అనుబంధాన్ని ఏర్పాటు చేసుకొంది.

మనం ఎంతగా ఫేస్ బుక్ ను ఉపయోగిస్తే అంతగా ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు జుకెన్ బర్గ్ కు ఆదాయం వస్తోంది.ఫేస్ బుక్ అకౌంట్లే జుకెన్ బర్గ్ కు పెట్టుబడి..
ఒక్కో ఖాతాదారుడి నుండి ప్రపంచవ్యాప్తంగా జుకెన్ బర్గ్ కు ఏటా సగటున రూ.1056 సంపాదిస్తున్నాడు.అంటే సుమారు 16 డాలర్లు. ఫేస్ బుక్ ఒక్కో ఖాతాపై ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగానే ఆర్జిస్తున్నాడు జుకెన్ బర్గ్. అత్యధికంగా కెనడా, అమెరికాలోని ఖాతాదారుల నుండి ఫేస్ బుక్ కు ఆదాయం వస్తోంది.












Click it and Unblock the Notifications