SRH vs MI:ఆల్ ది బెస్ట్ డాడ్... సన్‌రైజర్స్‌కు వార్నర్ కూతురు విషెస్

షార్జా: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) 2020 లీగ్‌ దశ మ్యాచ్‌లకు నేటితో తెరపడనుంది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారీ ఐపీఎల్‌ ప్లే ఆఫ్స్‌కు అర్హత పొందే చివరి జట్టేదో లీగ్‌ ఆఖరి మ్యాచ్‌తోనే తేలనుండటం విశేషం. ప్లేఆఫ్స్‌ చేరాలంటే తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్‌ను ఢీకొట్టేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సిద్ధమైంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు గెలిచి మంచి నెట్‌ రేట్‌తో ఉన్న వార్నర్‌సేన.. ఇప్పటికే నాకౌట్‌కు అర్హత సాధించిన ముంబైను ఓడిస్తే ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడితే కోల్‌కతాకు మార్గం సుగమమవుతుంది.

షార్జా వేదికగా ఈరోజు రాత్రి 7. 30 గంటలకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మ్యాచ్ ఆడనున్న నేపథ్యంలో ఆరెంజ్ ఆర్మీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆల్ ది బెస్ట్ చెపుతున్నారు. సన్‌రైజర్స్‌ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ముద్దుల కూతుళ్లు ఇండి రే, ఇవీ మే.. అతని సతీమణి క్యాండిస్‌ వార్నర్‌ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పారు. 'ఆల్ ది బెస్ట్ సన్‌రైజర్స్‌.. గో డాడీ.. గో' అని వీడియోలో పేర్కొన్నాడు. దీనికి సంబందించిన వీడియోను క్యాండిస్‌ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

IPL 2020: All the best Dad, Warners daughter wishes SRH team

ముంబై ఇండియన్స్‌తో కీలక మ్యాచ్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు ఉల్లాసంగా గడుపుతున్నారు. ఒత్తిడిని దరి చేరనీయకుండా.. కాసేపు సరదాగా గడుపుతున్నారు. డేవిడ్ వార్నర్, జానీ బెయిర్‌స్టోకు కేన్ విలియమ్సన్ ఫ్లాట్ వైట్ కాఫీ కలిపి ఇచ్చిన వీడియోను సన్‌రైజర్స్ ట్వీట్ చేసింది. కేన్స్ కేఫ్‌కు వ్యూయర్స్‌ను వార్నర్ ఆహ్వానించడం అందులో చూడొచ్చు. ఫ్లాట్ వైట్ కాఫీ చేస్తుండగా... వార్నర్ పక్కనుండి వ్యూయర్స్ కోసం కామెంట్రీ చెప్పుకొచ్చాడు. కాఫీ చేయడానికి కేన్ కొంచెం టైం తీసుకున్నా.. తాగిన తర్వాత కాఫీ అద్భుతంగా ఉందంటూ వార్నర్, బెయిర్ స్టో.. కేన్‌కు కితాబిచ్చారు.

ఈ సీజన్‌లో విశేషంగా దూసుకుపోతున్న డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ను ఓడించడం హైదరాబాద్‌కు కాస్త సవాలుతో కూడుకున్నదే. అయినా జట్టు సమష్టిగా రాణిస్తే విజయం తథ్యం. వార్నర్‌, బెయిర్‌స్టో, విలియమ్సన్‌, మనీష్‌, సాహా, హోల్డర్‌, రషీద్‌ రాణిస్తే విజయం సులువే. 2016లోనూ ఇలాగే ఆఖరి క్షణాల్లో ప్లేఆఫ్స్ చేరి టైటిల్‌ సాధించింది హైదరాబాద్‌. దీంతో వార్నర్‌ నేతృత్వంలో మరోసారి అలాంటి మాయాజాలమే చేసి విజయం సాధించాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరోవైపు హైదరాబాద్‌ గెలుపోటములపై కోల్‌కతా ప్లేఆఫ్స్‌ అవకాశాలు ఆధారపడ్డాయి. వార్నర్‌ టీమ్‌ గెలిస్తే హైదరాబాద్‌ తుది నాలుగులో నిలుస్తుంది. ఓడితే కోల్‌కతా నాలుగో స్థానంతో తదుపరి దశకు చేరుకుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+