IPL 2020: కోల్‌కతా జట్టు కెప్టెన్‌గా వైదొలిగిన దినేష్ కార్తీక్.. కొత్త కెప్టెన్ ఎవరంటే..?

అనుకున్నదే జరిగింది. దినేష్ కార్తీక్ నాయకత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసిన జట్టు యాజమాన్యం ఎట్టకేలకు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మెన్ ఇయాన్ మోర్గాన్ వైపు మొగ్గుచూపింది. ఇకపై ఐపీఎల్ టోర్నమెంటులో ఆడనున్న కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ఇయాన్ మోర్గాన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ వరుస ఓటములు చెందుతున్నప్పుడే దినేష్ కార్తీక్ కెప్టెన్సీపై పలు విమర్శలు వచ్చాయి.

Recommended Video

    IPL 2020 Breaking : Dinesh Karthik Left Kolkata Knight Riders Captaincy | MI VS KKR || Oneindia

    అప్పుడే తెరపైకి మోర్గాన్ పేరు వచ్చినప్పటికీ జట్టు యాజమాన్యం మాత్రం మరికొన్ని మ్యాచులకు దినేష్ కార్తీక్‌కే కెప్టెన్‌గా అవకాశం ఇచ్చింది. అయితే కెప్టెన్సీకి కార్తీక్ పూర్తి న్యాయం చేయలేకపోయాననే భావనలో దినేష్ కార్తీక్ ఉన్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తన బ్యాటింగ్‌పై ఫోకస్ చేయాలని భావించి కెప్టెన్సీ నుంచి వైదొలిగేందుకు అంగీకారం తెలిపాడు. అదే సమయంలో వైస్ కెప్టెన్‌గా ఉన్న మోర్గాన్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేయాలని కోరాడు.

    IPL 2020: Dinesh Karthik hands over the captaincy to Eoin Morgan

    2018లో దినేష్ కార్తీక్ గౌతం గంభీర్ నుంచి కోల్‌కతా నైట్ రైడర్స్‌ కెప్టెన్సీ బాధ్యతలు అందిపుచ్చుకున్నాడు. ఆ సమయంలో కోల్‌కతా మూడో స్థానంలో టోర్నమెంటును ముగించింది. ఇక 2019 సీజన్‌లో దినేష్ కార్తీక్ నాయకత్వంలోనే బరిలోకి దిగిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. నెట్ రన్ రేట్ కారణంగా కోల్‌కతా వెనకపడిపోయింది. ఇక ఇప్పటి వరకు 30కి పైగా దినేష్ కార్తీక్ నాయకత్వంలో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు 19 మ్యాచులో విజయం సాధించగా 16 మ్యాచుల్లో ఓటమి చవిచూసింది. ఒక మ్యాచ్‌ టైగా ముగిసింది.

    ప్రస్తుతం సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. అయితే మిగతా మ్యాచులకు మోర్గాన్ నాయకత్వం వహించనున్నాడు. ఇయాన్ మోర్గాన్ ఐపీఎల్‌లోకి 2015లో అరంగేట్రం చేశాడు. అప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కెరీర్‌ను ప్రారంభించాడు.2017లో పంజాబ్ జట్టుకు ఎంపికయ్యాడు. ఇక రూ.5.25 కోట్లు వెచ్చించి కోల్‌కతా జట్టు మోర్గాన్‌ను దక్కించుకుంది. ఇక మోర్గాన్ తాను ఐపీఎల్‌లో ఆడిన ఐదేళ్లలో 1021 పరుగులు చేశాడు. ఇక దినేష్ కార్తీక్ నుంచి బాధ్యతలు స్వీకరించిన మోర్గాన్ జట్టును విజయపథంలో నడపగలడా లేదా అనేది తెలియాలంటే వేచిచూడాల్సిందే .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+