DD vs KKR : కేకేఆర్‌కు ఢిల్లీతో డూ ఆర్ డై మ్యాచ్... గెలిస్తేనే ప్లే ఆఫ్ ఆశలు..

ఐపీఎల్ 13వ సీజన్‌లో భాగంగా శనివారం(అక్టోబర్ 24) అబుదాబి వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్-కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఢిల్లీ టాప్-2లో ఉండగా కేకేఆర్ నాలుగో స్థానంలో ఉంది. ఢిల్లీ క్యాపిటల్స్‌కే ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ దాదాపుగా ఖరారవగా... కేకేఆర్ మాత్రం మిగిలిన నాలుగు మ్యాచ్‌లలో గెలిస్తేనే ప్లేఆఫ్‌కి వెళ్లే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ జట్టుకు ఈ మ్యాచ్ ఒకరకంగా డూ ఆర్ డై లాంటిదే.

పేపర్‌పై బలంగానే కనిపిస్తున్న కోల్‌కతా నైట్ రైడర్స్ టీమ్‌ టోర్నమెంట్‌లో స్థిరంగా రాణించలేకపోతోంది. వరుస పరాజయాలతో జట్టు కెప్టెన్ దినేశ్ కార్తీక్ గత వారం కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రస్తుతం మోర్గాన్ ఆ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అతని నాయకత్వంలో టీమ్ గాడిన పడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.

ipl 2020 KKR takes on DC in a must-win contest

తమ చివరి మ్యాచ్‌లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్‌పై కోల్‌కతా పేలవ ప్రదర్శన ఆ జట్టును వెంటాడుతోంది. కేవలం 84 పరుగులకే చాప చుట్టేసి ఘోర పరాజయం పాలవడం ఆ జట్టు మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసింది.అయితే టీమ్ మేనేజ్‌మెంట్ మాత్రం.. తదుపరి మ్యాచ్‌లో కేకేఆర్ మంచి ప్రదర్శన కనబరుస్తుందన్న ధీమాతో ఉంది. మోర్గాన్,రస్సెల్,శుభ్‌మన్ గిల్,కార్తీక్ వరుసగా విఫలమవుతుండటం ఆ జట్టు పరాజయాలకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.

మరోవైపు ఢిల్లీ నిలకడగా రాణిస్తూ దూసుకెళ్తోంది. ఓపెనర్ శిఖర్ ధావన్ రెండు వరుస సెంచరీలతో ఫామ్‌లో ఉండటం ఆ జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే యువ ఆటగాడు పృథ్వీ షా ఫామ్ కోల్పోవడం ఆ జట్టును కాస్త కలవరపెడుతోంది. అతని చివరి నాలుగు ఇన్నింగ్స్‌లో రెండు డకౌట్స్ ఉండటం గమనార్హం. అయితే కేకేఆర్‌తో మ్యాచ్‌లో అతను ఫామ్ అందుకుంటాడని ఢీల్లీ నమ్మకంగా ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+