• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సంజు శాంసన్‌కు ఏమైంది? ఆ స్టన్నింగ్ క్యాచ్ పట్టిన సమయంలో: యంగ్‌టర్క్ హవా

|

దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2020 సీజన్‌లో 13వ ఎడిషన్‌లో భాగంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ స్టేడియం వేదికగా కోల్‌కత నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో యువ క్రికెటర్ల హవా సాగింది. రెండు జట్లలోనూ అప్ కమింగ్ క్రికెటర్లు సత్తా చాటారు. ఫలితం మాటెలా ఉన్నప్పటికీ.. సీనియర్ల కంటే జూనియర్లే అద్భుతంగా రాణించగలిగారు. మ్యాచ్ షో అంతా యంగ్ క్రికెటర్లదే. వికెట్లు పడగొట్టినా.. స్టన్నింగ్ క్యాచ్‌లను పట్టినా.. బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించినా.. అదంతా యంగ్ క్రికెటర్ల ఖాతాల్లోకే వెళ్లిపోయాయి.

యంగ్ క్రికెటర్ల హవా..

యంగ్ క్రికెటర్ల హవా..

కోల్‌కత నైట్ రైడర్స్ టీమ్ ఘన విజయం సాధించడానికి బౌలర్లు కీలక పాత్ర పోషించారు. కేకేఆర్ టీమ్‌లో బౌలింగ్ చేసిన మొత్తం ఆరుమందీ వికెట్లను పడగొట్టారు. అందులో యంగ్ బౌలర్ల వాటా అధికం. ఇప్పటిదాకా అంతర్జాతీయ మ్యాచ్‌లను ఆడిన అనుభవం లేని శివం మావి, కమలేష్ నగర్కోటి, వరుణ్ చక్రవర్తి రెండు వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. శివమ్ మావి నాలుగు ఓవర్లలో 20 పరుగులు మాత్రమే ఇచ్చి, ఇంగ్లండ్ టాప్ బ్యాట్స్‌మెన్ జోస్ బట్లర్‌ను అవుట్ చేశాడు. ఈ టోర్నమెంట్‌లో ఆడిన తొలి మ్యచ్‌ నుంచీ దూకుడును ప్రదర్శిస్తోన్న సంజు శాంసన్‌ వికెట్‌ను పడగొట్టాడు.

బౌలింగ్‌లో దూకుడు..

బౌలింగ్‌లో దూకుడు..

కమలేష్ నగర్కోటి.. మరింత పొదుపుగా బౌలింగ్ చేశాడు. రెండు ఓవర్లలో 13 పరుగులే ఇచ్చి రెండు వికెట్లను తీసుకున్నాడు. రాబిన్ ఊతప్ప, రియాన్ పరాగ్‌లను వెంటవెంటనే పెవిలియన్ పంపించాడు. ఒకే ఓవర్‌లో వారిద్దరినీ అవుట్ చేశాడు. మరో బౌలర్ వరుణ్ చక్రవర్తి తన నాలుగు ఓవర్ల కోటాలో 25 పరుగులు ఇచ్చాడు. రాహుల్ తెవాటియా, జోఫ్రా ఆర్చర్‌ల వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఫలితంగా- కోల్‌కత నైట్ రైడర్స్ నిర్దేశించిన 175 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేక రాజస్థాన్ రాయల్స్ చతికిలి పడ్డారు. 137 పరుగుల వద్దే ఆగిపోయారు.

రాజస్థాన్ రాయల్స్‌ ఇన్నింగ్‌లోనూ మెరిసిన యంగ్ స్టార్..

రాజస్థాన్ రాయల్స్‌ ఇన్నింగ్‌లోనూ మెరిసిన యంగ్ స్టార్..

రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్‌లోనూ యంగ్ క్రికెటర్ మెరుపులు మెరిపించాడు. జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్, రాబిన్ ఊతప్ప వంటి సీనియర్ క్రికెటర్లు విఫలమైన చోట.. యంగ్ టర్క్ టామ్ కుర్రమ్ ఒక్కడే బ్యాటింగ్‌లో రాణించాడు. రాజస్థాన్ రాయల్స్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగిందంటే అది టామ్ కుర్రమ్ చెలరేగిపోయి ఆడటం వల్లే. 36 బంతులను ఎదుర్కొన్న టామ్ కుర్రమ్ 54 పరుగులు చేశాడు. ఇందులో మూడు సిక్సర్లు, రెండు ఫోర్లు ఉన్నాయి. రాజస్థాన్ రాయల్స్ టీమ్‌లో అతనే టాప్ స్కోరర్. బట్లర్-21, తెవాటియా-14 మినహా మరెవరూ రెండంకెల స్కోరును అందుకోలేకపోయారు.

తలకు గాయం బారి నుంచి..

తలకు గాయం బారి నుంచి..

కోల్‌కత నైట్ రైడర్స్ ఇన్నింగ్‌లో సంజు శాంసన్ తలకు గాయం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఇన్నింగ్ 18వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. టామ్ కుర్రమ్ వేసిన 18వ ఓవర్ చివరి బంతిని భారీ షాట్ ఆడాడు కోల్‌కత నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పాట్ కమ్మిన్స్. గాల్లోకి లేచిన ఆ బంతిని బౌండరీ లైన్ వద్ద సంజు శాంసన్ అద్భుతంగా క్యాచ్ పట్టాడు. మూడు అడుగుల మేర గాల్లోకి ఎగిరి బాల్‌ను అందుకున్న అతను నిలదొక్కుకోలేకపోయాడు. కిందపడ్డాడు. వెనక్కి పల్టీ కొట్టాడు. ఆ సమయంలో అతని తలకు పట్టేసినట్టుగా కనిపించింది. కొద్దిసేపు గ్రౌండ్ మీది నుంచి లేవలేకపోయాడు. ఆ తరువాత కూడా తల రుద్దుకుంటూ కనిపించాడు.

English summary
The Rajasthan Royals star batsman Sanju Samson took a stunning catch towards the end of the innings to dismiss Pat Cummins. In the process, he nearly suffered a nasty head injury after hitting his head on the ground while taking the catch.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X