IPL 2020: చెన్నై మ్యాచ్‌కు ముందు డెవీలియర్స్ ఏమన్నాడంటే..?
ఐపీఎల్ 2020లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓ అద్భుతమైన విజయాన్ని నమోదు చేస్తుందని అది ఎంతో దూరంలో లేదని చెప్పారు ఆర్‌సీబీ స్టార్ బ్యాట్స్‌మెన్ ఏబీ డెవీలియర్స్. ఈ సీజన్‌లో ఏబీ డెవీలియర్స్ 155 పరుగులు చేశాడు. ఆర్‌సీబీ టోర్నమెంటు ప్రారంభంలో చాలా చక్కటి ప్రదర్శన ఇచ్చింది కానీ... ఆ తర్వాత పట్టు కోల్పోయిందని చెప్పాడు. ఆర్‌సీబీ మూడు మ్యాచులు గెలిచి రెండు మ్యాచులు ఓటమి పాలైంది. దీంతో పాయింట్స్ టేబుల్‌లో ఐదవ స్థానంలో ఉంది.
" టోర్నీ ప్రారంభంలో బాగా ఆడాము. అయితే మధ్యలో గాడి తప్పాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కచ్చితంగా తిరిగి పుంజుకుంటుంది. ఆ నమ్మకం నాకుంది. గత మ్యాచ్‌లో నా ప్రదర్శన సరిగ్గా లేదు. ఇక పూర్తిగా ఆటపై దృష్టి సారిస్తాను. గత ఐదు మ్యాచుల్లో అనుకున్న స్థాయిలో జట్టు ప్రదర్శించలేక పోయింది" అని ఏబీ డెవీలియర్స్ అన్నాడు.

ఇక గత మ్యాచ్ తర్వాత కాస్త సమయం దొరికిందని చెప్పిన డెవీలియర్స్ ఈ గ్యాప్‌లో తప్పులను విశ్లేషించుకున్నామని వెల్లడించాడు. ఎక్కడ మెరుగ్గా రాణించాం.. ఎక్కడ వెనకబడి ఉన్నామనే విషయాలపై స్టడీ చేసినట్లు సైమన్ కాటిచ్ వెల్లడించాడు. ఇక రానున్న గేమ్స్‌లో పూర్తి స్థాయిలో సత్తా చాటి ప్లే ఆఫ్స్‌కు చేరుకుంటామని స్పష్టం చేశాడు.
Recommended Video
చెన్నై సూపర్ కింగ్స్ చాలా మంచి జట్టు అని పేర్కొన్న డెవీలియర్స్ శనివారం జరగనున్న మ్యాచ్‌లో తమ పూర్తి స్థాయి ప్రదర్శన ఇస్తేనే గట్టును పడగలుగుతామని చెప్పాడు. ధోనీ సేనతో ఆడటం నిజంగా సవాలుతో కూడుకున్న పని అని డెవీలియర్స్ వివరించాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్ అంటే చాలా కష్టమని ఇందుకోసం మూడు రోజుల నుంచి ప్రాక్టీస్ చేయడమే కాకుండా చెన్నై జట్టు ఆటతీరును కూడా నిశితంగా పరిశీలించినట్లు ఏబీ చెప్పాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఆడేందుకు చాలామంది సత్తా కలిగిన ప్లేయర్స్ ఉన్నారని ఒకవేళ రొటేషన్ పద్ధతి అవలంబించాల్సి వస్తే వారికి కూడా అవకాశం ఇచ్చినట్లు అవుతుందని డెవీలియర్స్ చెప్పాడు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications