David Warner.. హర్ట్ అయ్యాడా? ఇక సన్‌రైజర్స్‌లో కనిపించడా? ఆరెంజ్ టీమ్‌కు గుడ్‌బై?
అబుధాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ 14వ ఎపిసోడ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఎట్టకేలకు ఓ ఘన విజయాన్ని అందుకుంది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై అద్వితీయమైన గెలుపును అందుకుంది సన్‌రైజర్స్ తన వరుస ఓటములకు చెక్ పెట్టింది. వరుసగా అయిదు మ్యాచుల్లో ఘోర పరాజయం అనంతరం అందిన మొదటి విజయం ఇది. ఈ గెలుపుతో తన ప్లేఆఫ్ ఆశలను సజీవంగా నిలుపుకోగలిగిందా ఆరెంజ్ టీమ్.
Recommended Video

డేవిడ్ వార్నర్ లేకుండానేే..
డాషింగ్ ఓపెనర్, మాజీ కేప్టెన్ డేవిడ్ వార్నర్ లేకుండానే ఈ విజయాన్ని అందుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టే సాహసం చేసింది సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్. సత్ఫలితాలను అందుకుంది. ఏ మాత్రం ఫామ్‌లో లేని వార్నర్‌ను డగౌట్‌కే పరిమితం చేసింది. అతని స్థానంలో ఇంగ్లాండ్‌కు చెందిన వన్డే ఇంటర్నేషనల్స్, టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ జేసన్ రాయ్‌ను ఓపెనర్‌గా క్రీజ్‌లోకి దింపింది. ఈ వ్యూహం అద్భుత ఫలితాన్ని ఇచ్చింది.

జేసన్ రాయ్ భారీ స్కోర్..
ఓపెనర్‌గా బరిలోకి దిగిన జేసన్ రాయ్ భారీ స్కోర్ సాధించాడు. 42 బంతుల్లో ఎనిమిది ఫోర్లు, ఒక సిక్స్‌తో 60 పరుగులు చేశాడు. తోటి ఓపెనర్ వృద్ధిమాన్ సాహా త్వరగా అవుట్ అయినప్పటికీ- వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్, కేప్టెన్ కేన్ విలియమ్సన్ సహకారంతో జట్టును విజయ తీరాలకు చేర్చాడు. ఈ మ్యాచ్‌లో విలియమ్సన్ అర్ధసెంచరీతో నాటౌట్‌గా నిలిచాడు. 41 బంతుల్లో అయిదు ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేశాడు. జేసన్ రాయ్-విలియమ్సన్ భారీ భాగస్వామ్యం నెలకొల్పడంతో సన్‌రైజర్స్ విజయం ఖాయమైంది.

రెండో విజయం మాత్రమే..
ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో గెలుపు ఇది. ఇప్పటిదాకా 10 మ్యాచులను ఆడిన సన్‌రైజర్స్ ఎనిమిదింట్లో పరాజయం పాలైంది. రెండింట్లో గెలిచింది. ఆ జట్టు ఖాతాలో ఉన్నవి నాలుగు పాయింట్లే. మిగిలిన నాలుగు మ్యాచులను వరుసగా గెలుచుకుంటే ప్లే ఆఫ్ రేస్‌లో నిలవగలుగుతుంది. గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో డేవిడ్ వార్నర్‌ను పక్కన పెట్టి సాహసం చేసింది. ఈ ప్లాన్ సక్సెస్ కావడం, వార్నర్ స్థానంలో క్రీజ్‌లోకి దిగిన జేసన్ రాయ్ భారీ స్కోర్ సాధించడం కొంత డిబేట్‌కు దారి తీసింది.

ఇక వార్నర్ కనిపించడా?
ఇదివరకు సన్‌రైజర్స్ కేప్టెన్‌గా వ్యవహరించాడు డేవిడ్ వార్నర్. ఈ సీజన్ ఆరంభంలో అతనే కేప్టెన్. ఆ తరువాత అతన్ని తప్పించింది ఫ్రాంఛైజీ. కేన్ విలియమ్సన్‌కు ఆ బాధ్యతను అప్పగించింది. ఇప్పుడు- ఎమిరేట్స్‌లో గెలిచి తీరాల్సిన మ్యాచ్‌లో తనను పక్కన పెట్టడం వల్ల అతను హర్ట్ అయ్యాడనే అభిప్రాయాలు సోషల్ మీడియాలో వ్యక్తమౌతున్నాయి. మైక్రో బ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ వేదికగా ఒక అభిమాని ఇచ్చిన ప్రశ్నకు వార్నర్ ఇచ్చిన సమాధానంపై ఎన్నో అనుమానాలు, ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి.
వార్నర్ కనిపించట్లేదంటూ
డేవిడ్ వార్నర్ స్టేడియంలో ఉన్నాడా?..అతను కనిపించట్లేదంటూ సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్యాన్ ఒకరు ట్వీట్ చేశాడు. దాన్ని డేవిడ్ వార్నర్‌కు ట్యాగ్ చేశాడు. అతనికి వార్నర్ సమాధానం ఇచ్చాడు. దురదృష్టవశావత్తూ అది మళ్లీ జరగదు.. సపోర్ట్‌ను కంటిన్యూ చేయండి.. అంటూ రిప్లయ్ ఇచ్చాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో పెద్ద డిబేట్‌కు దారి తీసింది. సన్‌రైజర్స్ తరఫున ఇక డేవిడ్ వార్నర్ ఆడబోడనే విషయాన్ని అతను చెప్పకనే చెప్పాడని అంటున్నారు.

అంచనాలను అందుకోని వార్నర్..
ఈ సీజన్‌లో డేవిడ్ వార్నర్ ఆటతీరు పట్ల అభిమానులు తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తోన్నారు. ఇప్పటిదాకా అతను 195 పరుగులు మాత్రమే చేశాడు. బ్యాటింగ్ యావరేజ్ 24.37. స్ట్రైక్ రేట్ కూడా పెద్దగా లేదు. అతని యావరేజ్ స్ట్రైకింగ్ రేట్ 107.73గా రిజిస్టర్ అయింది. ఈ సీజన్‌లో రెండు హాఫ్ సెంచరీను బాదాడు. ఎమిరేేట్స్‌కు మ్యాచ్‌లు షిఫ్ట్ అయిన తరువాతా బ్యాటింగ్ గాడిన పడలేదు. ఢిల్లీ కేపిటల్స్‌తో మ్యాచ్‌లో సున్నాకే అవుట్ అయ్యాడు. పంజాబ్ కింగ్స్ మ్యాచ్‌లోనూ అంతే. రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. దీనితో అతన్ని పక్కన పెట్టి.. జేసన్ రాయ్‌కు అవకాశం కల్పించింది మేనేజ్‌మెంట్. అది సక్సెస్ అయింది.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం












Click it and Unblock the Notifications