పండగ పూటా పాత ముఖాలే: ఫైనల్ ఓడని కోల్‌కత: ధోనిసేనకు దడ

అబుధాబి: యునైటెడ్ అరబి ఎమిరేట్స్ వేదికగా రసవత్తరంగా సాగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్..14వ ఎపిసోడ్ ముగింపు దశకు వచ్చింది. ఈ సాయంత్రమే ఫైనల్ మ్యాచ్. టైటిల్ కోసం మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్‌తో కోల్‌కత నైట్ రైడర్స్ పోరాడనుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఈ హైఓల్టేజ్ మ్యాచ్‌కు వేదిక. భారత కాలమానం ప్రకారం.. ఈ సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది.

చెన్నై సూపర్

చెన్నై సూపర్

పేరుకు తగ్గట్టే- చెన్నై సూపర్ కింగ్స్.. నిజంగానే సూపర్ అనిపించుకుంది. ఇదే ఎమిరేట్స్ గడ్డపై గత ఏడాది ఐపీఎల్ సీజన్‌లో అధ్వాన్నంగా ఆడిందీ టీమ్. పేలవ ప్రదర్శనతో కనీసం ప్లేఆఫ్స్‌కు కూడా చేరలేదు. పైగా లీగ్ దశలోనే నిష్క్రమించిన మొట్టమొదటి జట్టుగా ముద్ర వేసుకుంది. ధోని పనై పోయిందంటూ అప్పట్లో వార్తలొచ్చాయి. ధోని రిటైర్‌మెంట్ ప్రకటించాల్సిన సమయం వచ్చిందనే వ్యాఖ్యలు వినిపించాయి. సీజన్ తిరిగే సరికి.. అందరి నోళ్లనూ మూయించాడు ధోని.

దర్జాగా ఫైనల్‌లో..

దర్జాగా ఫైనల్‌లో..

ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రస్థానం అద్భుతంగా సాగింది. వరుస విజయాలతో ఫైనల్‌కు దూసుకొచ్చింది. లీగ్ దశలో 14 మ్యాచుల్లో తొమ్మిదింట్లో జయ కేతనాన్ని ఎగురవేసింది. లీగ్ దశలో ఆడిన చివరి మూడు మ్యాచుల్లో ఓడిపోయినప్పటికీ.. దాని ప్రభావాన్ని ప్లేఆఫ్స్‌పై పడనివ్వలేదు. టేబుల్ టాపర్‌గా నిలిచిన ఢిల్లీ కేపిటల్స్‌ తుక్కు రేగ్గొట్టింది. దర్జాగా ఫైనల్‌లో ప్రవేశించింది. ఆ మ్యాచ్‌ను చెన్నై సూపర్ కింగ్స్ గెలిచిందంటే.. అది మహేంద్రుడి మాయాజాలమే. చివరి ఓవర్‌లో పిడుగుల్లాంటి షాట్లతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.

మూడుసార్లు ఛాంపియన్..

మూడుసార్లు ఛాంపియన్..

ఇప్పటివరకు ఐపీఎల్‌లో అత్యధికంగా టైటిళ్లను గెలిచిన రెండో జట్టు సూపర్ కింగ్స్. మూడుసార్లు ఛాంపియన్‌గా నిలిచింది. 2010, 2011, 2018 సీజన్లలో టైటిల్స్ తన ఖాతాలో వేసుకుంది. ఈ మూడు టైటిల్స్ కూడా ధోని సారథ్యంలో వచ్చినవే. 2010 సీజన్ ఫైనల్‌లో ముంబై ఇండియన్స్‌ను 22 పరుగుల తేడాతో ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై.. 20 ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసింది. ఛేదనలో ముంబై తడబడింది. 146 పరుగుల వద్దే నిలిచింది.

మురళీ విజయ్ ఇన్నింగ్ హైలైట్..

మురళీ విజయ్ ఇన్నింగ్ హైలైట్..

2011 సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్‌ను ఓడించింది చెన్నై. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈ జట్టు ఏకంగా 205 పరుగులు చేసింది. మురళీ విజయ్ 95 పరుగులు చేయడం మొత్తం మ్యాచ్‌కే హైలెట్. 52 బంతుల్లో ఆరు సిక్సర్లు, నాలుగు ఫోర్లతో 95 పరుగులు చేశాడీ ఓపెనర్. మరో ఓపెనర్ మైక్ హస్సీ 45 బంతుల్లో మూడు సిక్సర్లు, మూడు ఫోర్లతో 63 పరుగులు చేశాడు. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాయల్ ఛాలెంజర్స్ ఎనిమిది వికెట్ల నష్టానికి 147 పరుగులే చేయగలిగింది. 2018లో మన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది చెన్నై. ఫైనల్‌లో సన్‌రైజర్స్ 178 పరుగులు చేయగా.. ఆ లక్ష్యాన్ని చెన్నై ఛేదించింది.

ఫైనల్ ఫీవర్..

ఫైనల్ ఫీవర్..

నిజానికి- మూడు కంటే ఎక్కువ టైటిళ్లను గెలిచే అవకాశం చెన్నైకి లభించినప్పటికీ.. దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. అయిదుసార్లు ఫైనల్‌కు చేరింది. చెన్నై సూపర్ కింగ్స్ 2008, 2012, 2013, 2015, 2019 సీజన్లలో ఫైనల్ వరకూ చేరినప్పటికీ.. దాన్ని విజయంగా మలచుకోలేకపోయింది. ఛాంపియన్‌గా ఆవిర్భవించలేకపోయింది. 2012 ఫైనల్‌లో కోల్‌కత నైట్ రైడర్స్ చేతిలోనే ఓడిపోయింది. ఆ పరాభవంపై ప్రతీకారాన్ని తీర్చుకోవాలనే పట్టుదలతో ఉంది చెన్నై సూపర్ కింగ్స్.

రెండుసార్లు కోల్‌కత..

రెండుసార్లు కోల్‌కత..

కోల్​కతా నైట్​రైడర్స్​ ఇప్పటిదాకా.. రెండుసార్లు ఐపీఎల్ ఛాంపియన్‌గా ఆవిర్భవించింది. ట్విస్ట్ ఏమిటంటే.. రెండుసార్లు ఫైనల్‌కు చేరి.. రెండుసార్లూ విజయం సాధించడం. ఫైనల్ మ్యాచ్ ఓడిపోలేదు నైట్ రైడర్స్. ఇక ముచ్చటగా మూడోసారి కూడా ఫైనల్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఫైనల్ మ్యాచ్ గెలిచే ఆనవాయితీని కొనసాగిస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. 2012 నాటి పాత ప్రత్యర్థిపై విజయం సాధిస్తుందా? లేక తల వంచుతుందా? అనేది ఈ సాయంత్రానికి తేలిపోతుంది.

కోల్‌కత ప్రయాణం అద్భుతం..

కోల్‌కత ప్రయాణం అద్భుతం..

నిజానికి- కోల్‌కత నైట్ రైడర్స్ ఫైనల్ వరకూ వచ్చిందంటే ఓ అద్భుతమే. ఈ సీజన్‌ ఫస్ట్ హాఫ్‌లో ఏడు మ్యాచుల్లో ఆడిన కోల్‌కత రెండింట్లో మాత్రమే మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో కనిపించింది. ఆ జట్టు టాప్ ఫోర్‌లో వస్తుందని ఎవరూ ఊహించి ఉండరు. సెకండాఫ్‌లో మాత్రం పూర్తి భిన్నమైన ఫలితాలు రాబట్టింది. వరుస మ్యాచుల్లో విజయాలను సాధించింది. కీలక మ్యాచుల్లో తిరుగులేదనిపించింది. లీగ్ దశలో ఆడిన చివరి అయిదు మ్యాచుల్లో రెండింట్లో ఓడిందంతే. లీగ్ దశలో అద్భుతంగా ఆడిన ఢిల్లీ కేపిటల్స్‌ను ప్లేఆఫ్స్‌లో మట్టి కరిపించింది.

ఎవరు టైటిల్ గెలిచినా..

ఎవరు టైటిల్ గెలిచినా..

ఈ ఐపీఎల్ సీజన్‌లో ఎవరు విన్నర్‌గా నిలిచినా గానీ.. అది ఆయా జట్ల టైటిళ్ల సంఖ్యను పెంచుతుంది. చెన్నై గెలిస్తే.. ఆ జట్టు ఖాతాలో నాలుగు టైటిల్స్ పడినట్టవుతుంది. కోల్‌కత విజయం సాధిస్తే.. మూడుసార్లు ఛాంపియన్‌గా ఆవిర్భవించినట్టవుతుంది. ఈ సీజన్‌లో అయినా కొత్త జట్టు ఛాంపియన్‌గా అవతరిస్తుందని ఆశించిన వారికి నిరాశే. ఇప్పటిదాకా టైటిల్ గెలవని ఢిల్లీ కేపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు.. ప్లేఆఫ్స్ మ్యాచులను విజయాలుగా మలచుకోలేకపోయాయి. చతికిలి పడ్డాయి. ఫలితంగా- మరోసారి పాత ఛాంపియన్లనే మళ్లీ చూడాల్సి వస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+