SRH vs KKR:స‌న్‌రైజ‌ర్స్‌ 'మిస్ట‌రీ గ‌ర్ల్' ఎవ‌రో తెలుసా?

హైదరాబాద్: గత ఫిబ్రవరి 18న చెన్నై వేదికగా జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 మినీ ఆక్షన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున వచ్చిన ఓ అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించారు. కెమెరాలు సైతం ఆ అమ్మాయినే పదేపదే క్యాప్చర్ చేశాయి. ఇప్పుడా మిస్ట‌రీ గ‌ర్లే.. ఆదివారం రాత్రి వాంఖడే మైదానంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచులో కూడా తళుక్కుమన్నారు. స్టాండ్స్‌లో కూర్చొని సన్‌రైజర్స్ టీమ్‌ను ఎంకరేజ్ చేశారు. దీంతో నెటిజన్లలో ఆమె ఎవరో తెలుసుకోవాలన్న ఆసక్తి పెరిగింది. ఆమె పేరు కావ్య మారన్.

29 ఏళ్ల కావ్య మారన్ మరెవరో కాదు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ టీమ్ సీఈవో. త‌మిళ‌నాడు మీడియా కింగ్ క‌ళానిధి మార‌న్ ఏకైక కూతురు. ఆమె ప్రస్తుతం సన్ మ్యూజిక్, సన్ టీవీ ఎఫ్‌ఎం ఛానల్స్‌కు సీఈవో. స‌న్ నెట్‌వ‌ర్క్ చానెల్స్ బిజినెస్‌లోనూ ఆమె చాలా యాక్టివ్‌గా ఉంటారు. స‌న్‌రైజ‌ర్స్ తొలి మ్యాచ్‌కు వచ్చిన కావ్య మారన్.. తన అందచందాలతో అందరి కళ్లను తనవైపుకు తిప్పుకున్నారు. స‌న్‌రైజ‌ర్స్ ఆటగాళ్లు వికెట్ తీసినప్పుడు.. బౌండరీలు, సిక్సులు బాదినప్పుడు ఆమె సెలెబ్రేషన్స్ చేసుకున్నారు.

IPL 2021: Mystery Girl Kaviya Maran seen celebrating after Gills wicket in SRH vs KKR match

కావ్య మారన్ తొలిసారి 2018 సీజ‌న్ ఐపీఎల్‌లో కనిపించారు. అప్పుడు కూడా కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ మ్యాచ్‌లోనే ఆమె క‌నిపించ‌డం విశేషం. ఆదివారం మ్యాచ్‌లో కేకేఆర్ ఓపెన‌ర్ శుబ్‌మాన్‌ గిల్‌ను ర‌షీద్ ఖాన్ అవుట్ చేయ‌గానే కావ్య సెల‌బ్రేట్ చేసుకున్న వీడియో వైర‌ల్ ప్రస్తుతం నెట్టింట అయింది. ఇకపై కూడా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ ఆడే మ్యాచులకు కావ్య హాజరుకానున్నారట. కాగా ఆదివారం కోల్‌కతా‌తో జరిగిన మ్యాచులో సన్‌రైజర్స్‌ చివరివరకూ పోరాడినా ఓటమి తప్పలేదు.

188 పరుగుల భారీ ఛేదనలో ఆదిలోనే ఓపెనర్లు డేవిడ్‌ వార్నర్ ‌(3), వృద్ధిమాన్‌ సాహా (7) వికెట్లు కోల్పోయిన హైదరాబాద్.. ఆ‌ తర్వాత గొప్పగా పుంజుకుంది. జానీ బెయిర్‌స్టో (55; 40 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లు), మనీష్‌‌ పాండే (61 నాటౌట్: 44 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. వీరిద్దరూ రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే కీలక సమయంలో బెయిర్‌స్టో ఔటవ్వడంతో హైదరాబాద్‌ స్కోర్‌ వేగం తగ్గింది. ఆపై హిట్టర్లు మహ్మద్‌ నబీ (14), విజయ్‌ శంకర్ ‌(11) విఫలమయ్యారు. చివర్లో అబ్దుల్ సమద్ ‌(19; 8 బంతుల్లో 2x6) రెండు సిక్సులు బాదినా.. అప్పటికే ఆసల్యం అయింది. మనీశ్‌ చివరి బంతివరకు క్రీజులో ఉన్నా ఫలితం లేకుండాపోయింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+