IPL 2023..మెగా గ్రాండ్ ఓపెనింగ్: అదరగొట్టనున్న రష్మిక మందన్న, తమన్నా

ఇంకొద్దిరోజుల్లో ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభం కాబోతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో తొలి మ్యాచ్ జరుగనుంది. ఐపీఎల్ ప్రారంభ వేడుకల్లో రష్మిక మందన్న, తమన్న అదరగొట్టనున్నారు.

అహ్మదాబాద్: ఇంకొద్ది రోజులు.. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. క్రికెట్ రణక్షేత్రంలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఐపీఎల్ 2023 (IPL 2023) ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి.

 తొలి మ్యాచ్..

తొలి మ్యాచ్..

ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

 ప్రారంభ వేడుకల్లో..

ప్రారంభ వేడుకల్లో..

ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI), ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమాయాత్తమౌతోంది. గతంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందిన కారణంగా నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం సాదాసీదాగా సాగింది. 2019, 2020, 2021, 2022 సీజన్లల్లో ఎలాంటి ఓపెనింగ్ సెరిమనిని నిర్వహించలేదు బీసీసీఐ. 2019 సీజన్ నాటికి కరోనా వైరస్ వ్యాప్తి లేనప్పటికీ- ఆ ఏడాది జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో ప్రారంభ వేడుకలు రద్దయ్యాయి. మిగిలిన మూడు సంవత్సరాలు కూడా కరోనా కాలంలో కలిసి పోయాయి. 2022 ఐపీఎల్ సీజన్ క్లోజింగ్ సెరిమనీలో మాత్రం ఏఆర్ రెహ్మాన్ పెర్‌ఫార్మ్ చేశారు.

 దీనికి భిన్నంగా..

దీనికి భిన్నంగా..

ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సీజన్ ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు మొదలు పెట్టింది. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న (Rashmika Mandanna), తమన్నా (Tamannah) పెర్‌ఫార్మ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు వారిద్దరితోనూ సంప్రదింపులు జరిపినట్లు కూడా తెలుస్తోంది. ఇందులో పెర్‌ఫార్మ్ చేయడానికి వారిద్దరూ అంగీకరించినట్లు చెబుతున్నారు.

2018లో చివరిసారిగా..

2018లో చివరిసారిగా..

2018లో చివరిసారిగా ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ ఏర్పాటైంది. ఆ ఈవెంట్‌ లో పరిణీతి చోప్రా, వరుణ్ ధవన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ పెర్‌ఫార్మ్ చేశారు. తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అదే చివరిది. ఆ సంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించనుంది బీసీసీఐ. ఇప్పటివరకు దిశా పటాని, టైగర్ ష్రాఫ్, కృతి సనన్, అమీ జాక్సన్, శ్రద్ధా కపూర్ వంటి టాప్ బాలీవుడ్ సెలెబ్రిటీస్ ఓపెనింగ్ సెరిమనీలో పెర్‌ఫార్మ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+