ఐపీఎల్ ఫీవర్: నాలుగేళ్ల తరువాత గ్రాండ్ ఓపెనింగ్‌: సెలెబ్రిటీస్ లిస్ట్ ఇదే..

అహ్మదాబాద్: ఇంకొక్క రోజు మాత్రమే మిగిలివుంది. ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ గ్రాండ్ గా ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఐపీఎల్ 2023 ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. తొలి మ్యాచ్ కోసం అహ్మదాబాద్ మొతెరాలోని నరేంద్ర మోదీ స్టేడియం సిద్ధమైంది.

శుక్రవారం తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్-చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి ఈ మ్యాచ్ లో. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ మొదలవుతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్‌కు మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు. గుజరాత్ టైటన్స్‌కు ఇది హోం పిచ్. పైగా హార్దిక్ పాండ్యా లోకల్ క్రికెటర్ కావడం కలిసొచ్చే అంశం. హోం పిచ్ పై గుజరాత్ టైటన్స్ ఎలా చెలరేగుతుందనేది ఆసక్తిగా మారింది.

IPL 2023: Ahmedabads Narendra Modi stadium is ready to host grand opening ceremony and first match

ఐపీఎల్ ఓపెనింగ్ సెలబ్రేషన్స్ ను గ్రాండ్ గా నిర్వహించడానికి భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇప్పటికే 10 జట్ల కేప్టెన్లు అహ్మదాబాద్ కు చేరుకున్నారు. ఐపీఎల్ 2023 ట్రోఫీతో కలిసి గ్రూప్ ఫొట్ దిగారు. నాలుగు సంవత్సరాల పాటు ఐపీఎల్ సీజన్ ప్రారంభోత్సవం సాదాసీదాగా సాగిన విషయం తెలిసిందే. 2019, 2020, 2021, 2022 సీజన్లల్లో ఎలాంటి ఓపెనింగ్ కార్యక్రమాలను నిర్వహించలేదు.

2019 సీజన్ నాటికి దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి లేదు. ఆ ఏడాది జమ్మూకాశ్మీర్ లోని పుల్వామాలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో సీఆర్పీఎఫ్ జవాన్లు వీరమరణం పొందిన నేపథ్యంలో ప్రారంభ వేడుకలు రద్దయ్యాయి. మిగిలిన మూడు సంవత్సరాలు కూడా కరోనా కాలంలో కలిసి పోయాయి. 2022 ఐపీఎల్ సీజన్ క్లోజింగ్ సెరిమనీలో మాత్రం ఏఆర్ రెహ్మాన్ పెర్‌ఫార్మ్ చేశారు. ఈ సారి మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ సీజన్ ప్రారంభోత్సవాలను వైభవంగా నిర్వహించడానికి బీసీసీఐ కసరత్తు పూర్తి చేసింది. ఈ సీజన్ ఓపెనింగ్ కార్యక్రమంలో పలువురు సెలెబ్రిటీలు పెర్‌ఫార్మ్ చేయనున్నారు. టాప్ హీరోయిన్స్ రష్మిక మందన్న, తమన్నా, ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్.. ఈ వేడుకల్లో మెరుపులు మెరిపించనున్నారు. 2018లో చివరిసారిగా ఐపీఎల్ గ్రాండ్ ఓపెనింగ్ సెరిమనీ ఏర్పాటైంది. ఆ ఈవెంట్‌ లో పరిణీతి చోప్రా, వరుణ్ ధవన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, హృతిక్ రోషన్ పెర్‌ఫార్మ్ చేశారు. తమ ప్రదర్శనతో అదరగొట్టారు. అదే చివరిది. ఆ సంప్రదాయాన్ని మళ్లీ పునరుద్ధరించనుంది బీసీసీఐ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+