IPL 2023.. నేటి నుంచే రెండున్నర నెలల క్రికెట్ జాతర: హైలైట్స్ ఇవే

అహ్మదాబాద్: మచ్ అవైటెడ్ ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఇంకొన్ని గంటల్లో గ్రాండ్‌గా ఆరంభం కాబోతోంది. ఈ సాయంత్రం 7:30 గంటలకు తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. ఇందులో గుజరాత్ టైటన్స్ - చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్‌కు ఆతిథ్యాన్ని ఇస్తోంది. మే చివరి వారం వరకూ మ్యాచ్ లు కొనసాగుతాయి. మొత్తం 10 జట్లు లీగ్ దశలో 70 మ్యాచ్‌లను ఆడనున్నాయి.

గత ఏడాదే ఐపీఎల్ లో ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటన్స్ తొలి సీజన్‌లోనే ఛాంపియన్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఫైనల్స్ లో రాజస్థాన్ రాయల్స్ ను మట్టికరిపించింది. తొలుత ఫీల్డింగ్ చేసిన గుజరాత్ టైటన్స్.. రాజస్థాన్ రాయల్స్ ను 130 పరుగులకే కట్టడి చేసింది. అనంతరం 18.1 ఓవర్లల్లో మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 133 పరుగులు చేసింది. ఐపీఎల్ 2022 సీజన్ ఛాంపియన్ గా ఆవిర్భవించిందా జట్టు.

IPL 2023

హార్దిక్ పాండ్యా సారథ్యంలోని ఈ జట్టు ఈ సీజన్ లో తన తొలి మ్యాచ్ లోనే బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొనబోతోంది. మహేంద్ర సింగ్ ధోనీ కేప్టెన్సీలో సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ జట్టుగా పేరు తెచ్చుకున్న చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీ కొట్టబోతోంది. గత ఏడాది ఏ మాత్రం రాణించలేదు చెన్నై సూపర్ కింగ్స్. 14 మ్యాచ్ లల్లో నాలుగింట్లోనే గెలిచింది. పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో నిలిచింది. ఇప్పుడు ఎలా సత్తా చాటుతుందనేది ఆసక్తి రేపుతోంది.

Hardik Pandya

ఈ రెండింటితో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్, ముంబై ఇండియన్స్, ఢిల్లీ కేపిటల్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కత నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. సన్‌రైజర్స్ హైదరాబాద్ కేప్టెన్ ఎయిడెన్ మార్క్‌రమ్ తొలి మ్యాచ్ కు దూరం అయ్యాడు. అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఆ మ్యాచ్ కు కేప్టెన్సీ బాధ్యతలను తీసుకోనున్నాడు.

MS Dhoni

ఢిల్లీ కేపిటల్స్- డేవిడ్ వార్నర్, ముంబై ఇండియన్స్- రోహిత్ శర్మ, రాజస్థాన్ రాయల్స్- సంజు శాంసన్, గుజరాత్ టైటన్స్- హార్దిక్ పాండ్యా, చెన్నై సూపర్ కింగ్స్- మహేంద్రసింగ్ ధోనీ, లక్నో సూపర్ జెయింట్స్- కేఎల్ రాహుల్, పంజాబ్ కింగ్స్- శిఖర్ ధవన్, కోల్‌కత నైట్ రైడర్స్- నితీష్ రాణా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు- ఫాఫ్ డుప్లెసిస్.. కేప్టెన్లుగా వ్యవహరిస్తోన్నారు. ఐపీఎల్ 2023 మ్యాచ్ లు గ్రాండ్ గా ఆరంభం కానున్నాయి. టాప్ హీరోయిన్లు రష్మిక మందన్న, తమన్నా, ప్రముఖ గాయకుడు ఆర్జిత్ సింగ్ తమ పెర్‌ఫార్మ్ తో అదరగొట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+