David Warner.. పుష్ప స్టైల్ లో ఎంట్రీ: అన్నా- నువ్వు మావోడివే

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ త్వరలో ఆరంభం కాబోతోంది. ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ప్లేయర్లందరూ తమ జట్లతో కలుస్తోన్నారు.

తొలి మ్యాచ్..

ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

IPL 2023: Captain David Warner joins Delhi Capitals in Pushpa style

1న ఢిల్లీ కేపిటల్స్..

డిఫెండింగ్ ఛాంపియన్ ఢిల్లీ కేపిటల్స్ (Delhi Capitals).. ఏప్రిల్ 1వ తేదీన తొలి మ్యాచ్ ఆడబోతోంది. లక్నో సూపర్ జెయంట్స్ (Lucknow Super Giants) ను ఢీ కొట్టనుంది. సాయంత్రం 7:30 గంటలకు ఉత్తర ప్రదేశ్ లక్నోలోని అటల్ బిహారీ వాజ్ పేయి ఏకన స్టేడియం (Ekana Stadium).. ఈ మ్యాచ్ కు ఆతిథ్యాన్ని ఇవ్వనుంది. ఇప్పటికే ప్లేయర్లందరూ తమ తమ జట్లను కలుసుకున్నారు. నెట్ ప్రాక్టీస్ పైన దృష్టి సారించారు.

జట్టుతో కలిసిన వార్నర్..

ఢిల్లీ కేపిటల్స్ (DC) జట్టు కేప్టెన్ డేవిడ్ వార్నర్ (David Warner) తాజాగా జట్టుతో కలిశాడు. పుష్ప (Pushpa) స్టైల్ లో తగ్గేదేలేదంటూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడీ ఆస్ట్రేలియన్ డాషింగ్ ఓపెనర్. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ రిషభ్ పంత్ (Rishabh Pant) స్థానంలో ఈ దఫా ఢిల్లీ కేపిటల్స్ కు అనుభవజ్ఞుడైన డేవిడ్ వార్నర్ సారథ్యాన్ని వహిస్తోన్న విషయం తెలిసిందే. అతని కేప్టెన్సీలో డీసీ.. ఎలా ఆడబోతోందనేది ఆసక్తి రేపుతోంది.

అన్నా నువ్వు మావోడివే..

డేవిడ్ వార్నర్ ఇదివరకే సన్‌ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) జట్టుకు ప్రాతినిథ్యాన్ని వహించిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు ఎస్ఆర్‌హెచ్ (SRH) తరఫున ఐపీఎల్ మ్యాచ్ లను ఆడాడు వార్నర్. అందుకే తెలుగు రాష్ట్రాల క్రికెట్ ప్రేమికులు అతణ్ని తమ వాడిగా భావిస్తోన్నారు. పుష్ప స్టైల్ లో డేవిడ్ వార్నర్ ఎంట్రీ ఇవ్వడాన్ని చూసి అన్నా నువ్వో మావోడివే అంటూ సంతోషాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

IPL 2023: Captain David Warner joins Delhi Capitals in Pushpa style
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+