IPL 2023:ముంబై జట్టుకు బుమ్రా స్ట్రోక్.. రోహిత్‌ అస్త్రాలేంటి..?

ముంబై: ఐపీఎల్ 16వ సీజన్ మార్చి 31వ తేదీన ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో అందరి కళ్లు ముంబై ఇండియన్స్ జట్టుపై ఉన్నాయి. ఐపీఎల్‌లో అత్యంత బలోపేతంగా కనిపించే జట్లలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఒకటి. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ఐదుసార్లు ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. గతేడాది అత్యంత పేలవమైన ప్రదర్శన కనబర్చి పాయింట్స్ టేబుల్‌లో చివరి స్థానంలో నిలిచింది. గతేడాది ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ కేవలం నాలుగు మ్యాచ్‌లు గెలిచి 8 పాయింట్లతో చివరిలో నిలిచింది. ఇక ఈ ఏడాది కొన్ని కొత్త ముఖాలు ఈ జట్టులో కనిపిస్తున్నాయి. ముంబై ఇండియన్స్ బలబలాలు ఏమిటో చూద్దాం.

జస్ప్రీత్ బుమ్రా దూరం

ముంబై ఇండియన్స్ జట్టులో బౌలింగ్ డిపార్ట్‌మెంట్‌లో ప్రధానాస్త్రంగా జస్ప్రీత్ బుమ్రా ఉన్నాడు. అయితే గాయం కారణంగా ఈ ఫాస్ట్ బౌలర్ ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు. 2013లో ముంబై ఇండియన్స్ జట్టు ద్వారా ఐపీఎల్ అరంగేట్రం చేసిన బుమ్రా.. తొలిసారిగా ఒక మొత్తం ఐపీఎల్ టోర్నీకి దూరం కానున్నాడు.అయితే జోఫ్రా ఆర్చర్ బుమ్రాను భర్తీ చేయగలిగే సత్తా ఉంది.ఇదిలా ఉంటే మరో ఫాస్ట్ బౌలర్ జై రిచర్డ్‌సన్‌ కూడా గాయంతో జట్టుకు దూరం కావడం రోహిత్ శర్మకు తలనొప్పిగా మారింది. బుమ్రా, రిచర్డ్స్‌న్ స్థానంలో ఇంకా ఎవరినీ ఆ జట్టు రీప్లేస్ చేయలేదు.

IPL 2023:How much will Jasprit bumrahs absence cost Mumbai Indians,Know the strengths and weakness

ముంబై జట్టులో కొత్త మార్పులు ఏంటి..?

2022 వేలంపాట సమయంలో ఆర్చర్‌ను ముంబై కొనుగోలు చేసింది. ఇప్పుడు ఈ ఫాస్ట్‌ బౌలరే ముంబైకి తురుపుముక్క కానున్నాడు.గతేడాది సీజన్‌కు ఆర్చర్ దూరమయ్యాడు.ఇక కీరన్ పొలార్డ్ కొత్త బాధ్యతలు తీసుకోవడంతో అతని స్థానంలో ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ దుమ్మురేపేందుకు సిద్ధమవుతున్నాడు. ఇక బంతిని బౌండరీకి పంపించగల సత్తా ఉన్న విష్ణు వినోద్‌ కూడా ముంబై జట్టుకు కలిసొస్తాడనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

బౌలింగ్ విభాగం బలహీనంగా..

2022లో జరిగిన మెగా వేలంపాటలో ముంబై ఇండియన్స్ ఫ్రాంఛైజీ 2023 ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకుని ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఇప్పుడు 2023 ఐపీఎల్ రానే వచ్చింది. అయితే జట్టుకు కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. ఇక పేరుగాంచిన స్పిన్నర్లు లేకుండానే టోర్నమెంట్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్‌కు గుర్తింపు ఉంది. అయితే ఇప్పుడు ఫాస్ట్ బౌలర్లు దూరమవడంతో అనుభవం లేని స్పిన్నర్లతో ముంబై బౌలింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తోంది.

ఇదీ ముంబై ఇండియన్స్ జట్టు:

రోహిత్ శర్మ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, టిమ్ డేవిడ్, డెవాల్డ్ బ్రెవిస్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), ట్రిస్టన్ స్టబ్స్, విష్ణు వినోద్, కామెరాన్ గ్రీన్, అర్జున్ టెండూల్కర్, రమణ్‌దీప్ సింగ్, షమ్స్ ములానీ, నేహాల్ వధేరా, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, దువాన్ జాన్‌సేన్, పీయుష్ చావ్లా, కుమార్ కార్తికేయ, రాఘవ్ గోయల్, జోఫ్రాఆర్చర్, జేసన్ బెహ్రెండ్రాఫ్, ఆకాష్ మాధ్వాల్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+