IPL 2023: ప్రత్యర్థులకు చుక్కలు చూపిన KKR ఆటగాడు సునీల్ నరైన్
ఐపీఎల్‌కు ముందు దేశీ క్రికెట్‌లో ఆడిన కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు సునీల్ నరైన్ ఏడు వికెట్లు తీసి స్వీట్ వార్నింగ్ ప్రత్యర్థులకు పంపాడు
కోల్‌కతా: ఐపీఎల్ 2023 సీజన్ మరో 10 రోజుల్లో ప్రారంభం కాబోతోంది. దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లోని క్రికెట్ అభిమానులు సైతం ఈ మెగా టోర్నీ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఆయా జట్ల ప్లేయర్స్ కూడా ఇప్పటికే ఈ బిగ్ టోర్నీకి ప్రాక్టీస్ మొదలెట్టేశారు. ఇంకా కొందరు విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోవాల్సి ఉంది. కొందరు ఆయా దేశాల్లో జరిగే దేశీ క్రికెట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ క్రమంలోనే కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)జట్టులోని కీలక ఆటగాడు సునీల్ నరైన్ బంతితో అద్భుతాలు సృష్టించి ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ పంపాడు. ఇంతకీ సునీల నరైన్ ఎలాంటి అద్భుతం చేశాడు..?
సునీల్ నరైన్ బంతితో మ్యాచ్‌ను ఒక్కసారిగా తిప్పేయగల సత్తా ఉన్న ఆటగాడు. అంతా కలిసొస్తే బ్యాట్‌తో కూడా ప్రత్యర్థులకు చుక్కలు చూపించే సామర్థ్యం ఉన్నవాడు. ఆ రోజు తనదైతే తనను ఎవరూ ఆపలేరని పలుమార్లు రుజువు చేశాడు. తాజాగా ఇలాంటి అద్భుతమే కరేబియన్ గడ్డపై చేశాడు. ట్రినిడాడ్ టొబాగోలోని క్వీన్స్ పార్క్ ఓవల్‌లో క్వీన్స్ పార్క్ క్లబ్ క్లార్క్ రోడ్ యునైటెడ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సునీల్ నరైన్ రెచ్చిపోయాడు. క్వీన్స్ పార్క్ క్లబ్ తరపున ఆడిన ఈ స్పిన్ మాంత్రికుడు క్లార్క్ రోడ్ యునైటెడ్ జట్టును మట్టి కరిపించాడు. దీంతో ఆ జట్టు 24 ఓవర్లలో 76 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది.


కేకేఆర్ జట్టులో సునీల్ నరైన్ (Sunil Narine) అత్యంత కీలక ఆటగాడు. సునీల్ నుంచి ఒక మంచి ప్రదర్శన వచ్చిందంటే ఆరోజు గేమ్ కేకేఆర్‌దే అన్నట్లుగా ముద్ర వేసుకున్నాడు.ఈ సారి ఐపీఎల్‌లో సునీల్ నరైన్ బంతితో మాయాజాలం చేసేందుకు సిద్ధమయ్యాడు. అంతేకాదు క్లార్క్ రోడ్ యునైటెడ్ జట్టుపై బంతితో మంత్రం చేసి ప్రత్యర్థులకు తానేంటో చూపించాడు. ఇక ఏప్రిల్ 1వ తేదీ కోల్‌కతా నైటర్ రైడర్స్ తన తొలి మ్యాచ్‌ను పంజాబ్‌తో ఆడనుంది. భుజం గాయం నుంచి శ్రేయాస్ అయ్యర్ ఇంకా కోలుకోకపోవడంతో ఐపీఎల్‌లో కొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. దీంతో కేకేఆర్‌కు సారథిగా సునీల్ నరైన్ ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.నరైన్‌తో పాటు మరో అరవీరభయంకరుడు ఆండ్రీ రస్సెల్, నితీష్ రానాలు కూడా కెప్టెన్సీ రేసులో ఉన్నారు.
మరి కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టును సునీల్ నరైన్ తన స్పిన్ మాయాజాలంతో ఫైనల్స్‌కు చేరుస్తాడా లేదా అనేది వేచి చూడాలి మరి.












Click it and Unblock the Notifications