Matthew Short: పంజాబ్ కింగ్స్‌లో మరో ఆల్‌రౌండర్- బెయిర్ స్టోకు రీప్లేస్

న్యూఢిల్లీ: ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఇంకొద్దిరోజుల్లో ఆరంభం కాబోతోంది. ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ షెడ్యూల్ అయింది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులను ఉర్రూతలూగించబోతోందీ మెగా క్రికెట్ టోర్నమెంట్. దీని కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. ఐపీఎల్ 2023 ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి.

తొలి మ్యాచ్..

ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఢీ కొట్టబోతోంది. సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

IPL 2023: Matthew Short replaces injured Jonny Bairstow in Punjab Kings

పంజాబ్ కింగ్స్..

ఏప్రిల్ 1వ తేదీ రెండో మ్యాచ్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)-కోల్ కత నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలపడనున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది. మధ్యాహ్నం 3:30 గంటలకే మ్యాచ్ మొదలవుతుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు గబ్బర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)- కోల్ కత నైట్ రైడర్స్ (KKR) నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.

బెయిర్ స్టో దూరం..

ఇప్పుడు- సీజన్ ఆరంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (Johny Bairstow) జట్టుకు దూరం అయ్యాడు. సిరీస్ మొత్తానికీ ఆడట్లేదు. గాయం వల్ల కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తోన్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత యాషెస్ టోర్నమెంట్ ను ఆడాల్సి ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ ప్రతిష్ఠాత్మక యాషెస్ కోసం సన్నద్ధం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు.

మాట్ షార్ట్..

బెయిర్ స్టో స్థానంలో మరో డాషింగ్ బ్యాటర్ ను తీసుకుంది పంజాబ్ కింగ్స్. ఆస్ట్రేలియాకు చెందిన ఆల్ రౌండర్ మాథ్యూ షార్ట్ కు చోటు కల్పించింది. బెయిర్ స్టో స్థానంలో మాథ్యూ షార్ట్ ను జట్టులోకి తీసుకున్నట్లు ప్రకటించింది. అతనికి ఇదే తొలి ఐపీఎల్ టోర్నమెంట్. బిగ్ బాష్ లీగ్ (Big Bash League) లో దుమ్ము దులిపాడు. బీబీఎల్ (BBL)లో అడిలైడ్ స్ట్రైకర్స్ కు అతను ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ గా నిలిచాడు. 144.47 స్ట్రైక్ రేట్ తో 458 పరుగులు చేశాడు. ఆఫ్ స్పిన్నర్ కూడా. బీబీఎల్ (BBL) లో 11 వికెట్లు తీసుకున్నాడు. హాబర్ట్ హరికేన్ మీద జరిగిన మ్యాచ్ లో సెంచరీని అందుకున్నాడు.

ఆరోస్థానంతో..

గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆరో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఏడింట్లో విజయం సాధించిందంతే. టోర్నమెంట్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. ఆ తరువాత నీరసించిందీ జట్టు. ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఇప్పటి వరకూ ఈ జట్టు ఐపీఎల్ కప్ ను ముద్దాడలేదు. ఫైనల్స్ కు చేరిన సందర్భాలు కూడా చాలా తక్కువే. 2014 సీజన్ లో మాత్రమే ఫైనల్స్ ఆడిందీ జట్టు. కోల్ కత నైట్ రైడర్స్ (KKR) చేతిలో మట్టికరిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+