Dhoni:ధోని గురించి తెలియని రహస్యం చెప్పేసిన ఊతప్ప..!
ధోనీ తాను తీసుకున్న నిర్ణయాలు ఫలితాన్ని ఇవ్వకుంటే దానిపై ఆలోచిస్తూ నిద్రలేని రాత్రులు చాలా గడిపాడని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
IPL 2023: ఐపీఎల్ 2023 మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే ఆయా జట్లు ఈ మెగాటోర్నీకి సన్నద్ధం అవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మెగా స్పోర్టింగ్ ఈవెంట్‌గా ఐపీఎల్ గుర్తింపు పొందింది. ప్రత్యేకించి ఈ టోర్నీపై ఎన్నో కథనాలు వస్తుంటాయి. ఇక ఐపీఎల్‌లో చెన్నై జట్టుకు సూపర్ క్రేజ్ ఉంది. మొత్తానికి ఈ ఎల్లో టీమ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది.
అదే ఆ జట్టుకు నాయకత్వం వహించే ధోనీ. అవును ధోనీ (MS Dhoni) అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు కానీ... ఇప్పటికీ ఎప్పటికీ క్రికెట్ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా స్థానం సంపాదించుకున్నాడు. అతని నాయకత్వ లక్షణాలే ఆయన్ను ఈ స్థాయికి చేర్చింది. ధోనీ గురించి ఎవరికీ తెలియని నిజం ఒకటి మాజీ టీమిండియా క్రికెటర్ రాబిన్ ఊతప్ప బయటపెట్టాడు. ఇంతకీ ఆ విషయం ఏంటి..?

ఎంఎస్ ధోనీ, రాబిన్ ఊతప్పలు చాలా రోజులుగా మంచి స్నేహితులు. ఐపీఎల్ టోర్నీలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో ఇద్దరూ చేరకముందు టీమిండియాకు కలిసి ఎన్నో విజయాలను అందించారు. 2007 ఐసీసీ టీ20 ప్రపంచకప్ భారత్ గెలిచిన సమయంలో ఇద్దరూ టీమిండియా జట్టులోనే ఉన్నారు. రాబిన్ ఊతప్ప (Robin uthappa)ఇప్పుడు అన్ని ఫార్మాట్ క్రికెట్‌కు గుడ్ బై చెప్పేసి కొత్త ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు.
ఒకప్పుడు భారీ సిక్సులతో విరుచుకుపడ్డ రాబిన్ ఊతప్ప ఈ ఐపీఎల్ సీజన్‌లో కామెంటేటర్‌గా అవతారమెత్తనున్నాడు. జియో సినిమా టెలికాస్ట్ చేస్తున్న ఐపీఎల్ సీజన్‌లో వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. అయితే ధోనీతో తనకున్న సంబంధం, ధోనీ నాయకత్వ లక్షణాలపై రాబిన్ ఊతప్ప మాట్లాడాడు.

టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీ ఒక గొప్ప వ్యక్తిగా అభివర్ణించాడు. ధోనీలో నాయకత్వ లక్షణాలు సహజసిద్ధంగా వచ్చాయని చెప్పాడు. తానొక బాధ్యాతయుతమైన కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని గుర్తు చేసిన ఊతప్ప... గ్రౌండ్‌లో ధోనీ తీసుకున్న నిర్ణయాలు ఒకవేళ అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోతే ఆ రోజు తనకు నిద్రలేని రాత్రి అవుతుందని చెప్పాడు. తాను తీసుకున్న నిర్ణయం ఎందుకు ఫలితాన్ని ఇవ్వలేదనే దానిపై సుదీర్ఘంగా ఆలోచించే వ్యక్తి ధోనీ అని రాబిన్ ఊతప్ప చెప్పుకొచ్చాడు.
Picture of MS Dhoni, Devon Conway and Robin Uthappa. pic.twitter.com/nbYUeqjB5z
— CricketMAN2 (@ImTanujSingh) May 21, 2022
ధోనీ చాలావరకు సరైన నిర్ణయాలు తీసుకుంటాడని, ఆ నిర్ణయాలు దాదాపుగా ఫలితాలను ఇస్తాయని ఊతప్ప చెప్పాడు. అందుకే భారత్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా (Indias best captain) కొనియాడబడుతున్నాడని ఊతప్ప కితాబిచ్చాడు. ప్రతి ఫలితాన్ని ధోని తన బాధ్యతగా స్వీకరిస్తాడని అది చాలా తక్కువమందిలో కనిపిస్తుందని చెప్పాడు. ఒక మ్యాచ్ ఓడినా, గెలిచినా తనదే బాధ్యత అని చెప్తాడని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
ఒకవేళ ధోనీ తీసుకున్న నిర్ణయం అనుకున్న ఫలితాన్ని ఇవ్వకపోతే కొన్ని రోజుల వరకు నిద్రపోడని ఊతప్ప చెప్పాడు. ఒక మంచి కెప్టెన్ తీసుకున్న 10 నిర్ణయాల్లో ఒక నాలుగు లేదా ఐదు నిర్ణయాలు పాజిటివ్ రిజల్ట్ ఇస్తే... ధోనీ తీసుకునే నిర్ణయాలు 8 లేదా 9 పాజిటివ్ రిజల్ట్ ఇస్తుందని అదే ఇతరులకు ధోనీకి ఉన్న వ్యత్యాసమని ఊతప్ప చెప్పాడు.

ఇక తనకు తెలిసిన కెప్టెన్లలో కానీ ఆటగాళ్లలో కానీ అత్యంత వివాదరహితుడిగా ధోని మంచి పేరు తెచ్చుకున్నాడని ఊతప్ప చెప్పాడు. ధోనీ చాలా సింపుల్‌గా ఉండటమే అతని ప్రధాన బలమని కితాబిచ్చాడు. ధోనీ సింప్లిసిటీతోనే చాలావరకు అంశాలు గాడిలో పడతాయని చెప్పుకొచ్చాడు. ఇక ధోనీ ఆడే చివరి ఐపీఎల్ బహుశా ఇదే అవుతుందనే ప్రచారం జరుగుతోంది.
చెన్నై (Chennai super kings) అభిమానుల ముందు తాను రిటైర్ అవ్వాలనే కోరికను ధోనీ గతంలో వెల్లడించాడు. చెన్నై తనకు రెండో ఇంటిలాంటిదని ధోనీ పలు సందర్భాల్లో చెప్పాడు. ఇక ఒక సీజన్‌కు తప్పితే మిగతా అన్ని ఐపీఎల్ సీజన్లలో ధోనీ చెన్నైకు (CSK) ప్రాతినిథ్యం వహించాడు. ఐదవ సారి ఐపీఎల్ టైటిల్ సాధించి ఐపీఎల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాలని ధోని భావిస్తున్నాడు.
-
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
హైదరాబాద్ లో మరో అద్దిరిపోయే రైల్వే స్టేషన్ -
భారత్ బిగ్ టర్న్: షాక్ ఇచ్చిన చైనా, రష్యా ఐరాస వేదికగా హైడ్రామా -
విద్యార్థులకు శుభవార్త.. ఒంటిపూట బడులపై విద్యాశాఖ ప్రకటన, ఎప్పటినుండి అంటే -
కుప్పకూలిపోయిన గ్యాస్ బుకింగ్ సిస్టమ్! ఇలా చేస్తేనే గ్యాస్ బుకింగ్ -
సాగర్ మీదుగా హైదరాబాద్ టు విజయవాడ ఎక్స్ ప్రెస్ వే -
విజయవాడ- నిడదవోలు రైల్వే రూట్ లో ఇకపై.. !! -
యుద్ధం ముగింపుకు ఇరాన్ 3 షరతులు-భారత్ పై ప్రభావం ఇదే ? -
లాక్ డౌన్ లోకి పాకిస్థాన్.. ఇప్పట్లో బయట పడడం కష్టమే..!! -
గ్రీన్‌ఫీల్డ్ జాతీయ రహదారి బెంగళూరు-కడప-విజయవాడపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన -
కుప్పకూలిపోతున్న బంగారం ధరలు.. !! -
అన్నదాత సుఖీభవ డబ్బుల జమ.. అన్నీ శుభవార్తలు చెప్పిన సీఎం చంద్రబాబు












Click it and Unblock the Notifications