Jonny Bairstow: పంజాబ్ కింగ్స్‌కు బిగ్ షాక్- ఆ డాషింగ్ బ్యాటర్ దూరం: సిరీస్ మొత్తానికీ
ఐపీఎల్ సీజన్ ఆరంభానికి ముందే పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. కీలక బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ జానీ బెయిర్ స్టో ఈ సీజన్ కు దూరం అయ్యాడు.
న్యూఢిల్లీ: ఇంకొద్ది రోజులు.. ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తోన్న ధనాధన్ టోర్నమెంట్ ఇండియన్ ప్రీిమియర్ లీగ్ 2023 (IPL 2023) 16వ సీజన్ ఆరంభం కాబోతోంది. రెండున్నర నెలల పాటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ (Cricket) అభిమానులను ఉర్రూతలూగించబోతోంది. ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం ఫ్రాంఛైజీలన్నీ సన్నద్ధం అయ్యాయి. క్రికెట్ రణక్షేత్రంలో దిగడానికి ఉవ్విళ్లూరుతున్నాయి. ఐపీఎల్ 2023 ఛాంపియన్ గా ఆవిర్భవించడానికి మొత్తం 10 జట్లు పోటీ పడనున్నాయి. మొత్తం 70 మ్యాచ్ లు షెడ్యూల్ అయ్యాయి.

తొలి మ్యాచ్..
ఈ నెల 31వ తేదీన తొలి మ్యాచ్ జరుగనుంది. అహ్మదాబాద్ మొతేరాలోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ షెడ్యూల్ అయింది. గత సీజన్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్ (Gujarat Titans).. సెకెండ్ మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ గా గుర్తింపు పొందిన చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings)తో ఢీ కొట్టబోతోంది.
సాయంత్రం 7:30 గంటలకు మ్యాచ్ ఆరంభమౌతుంది. గుజరాత్ టైటన్స్ కు హార్దిక్ పాండ్యా (Hardik Pandya), సీఎస్‌కే (CSK)కు మహేంద్ర సింగ్ ధోనీ (MS Dhoni)- సారథ్యాన్ని వహిస్తోన్నారు.

పంజాబ్ కింగ్స్..
ఏప్రిల్ 1వ తేదీ రెండో మ్యాచ్ ఉంటుంది. పంజాబ్ కింగ్స్ (Punjab Kings)-కోల్ కత నైట్ రైడర్స్ (Kolkata Knight Riders) తలపడనున్నాయి. మొహాలీలోని పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం దీనికి ఆతిథ్యాన్ని ఇస్తోంది.
మధ్యాహ్నం 3:30 గంటలకే మ్యాచ్ మొదలవుతుంది. పంజాబ్ కింగ్స్ (PBKS) జట్టుకు గబ్బర్ శిఖర్ ధవన్ (Shikhar Dhawan) కేప్టెన్ గా వ్యవహరిస్తోన్నాడు. టీమిండియా బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer)- కోల్ కత నైట్ రైడర్స్ (KKR) నాయకత్వ బాధ్యతలను తీసుకున్నాడు.

ఆరోస్థానంతో..
గత సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) ఆరో స్థానంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. మొత్తం 14 మ్యాచ్ లను ఆడిన ఈ జట్టు ఏడింట్లో విజయం సాధించిందంతే. టోర్నమెంట్ ఆరంభంలో దూకుడుగా ఆడినప్పటికీ.. ఆ తరువాత నీరసించిందీ జట్టు. ఆశించిన స్థాయిలో సత్తా చాటలేకపోయింది. ఇప్పటి వరకూ ఈ జట్టు ఐపీఎల్ కప్ ను ముద్దాడలేదు. ఫైనల్స్ కు చేరిన సందర్భాలు కూడా చాలా తక్కువే. 2014 సీజన్ లో మాత్రమే ఫైనల్స్ ఆడిందీ జట్టు. కోల్ కత నైట్ రైడర్స్ (KKR) చేతిలో మట్టికరిచింది.

బిగ్ బ్లో..
ఇప్పుడు- సీజన్ ఆరంభానికి ముందే బిగ్ షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ జానీ బెయిర్ స్టో (Johny Bairstow) జట్టుకు దూరం అయ్యాడు. సిరీస్ మొత్తానికీ ఆడట్లేదు. గాయం వల్ల కొంతకాలంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ వస్తోన్నాడీ వికెట్ కీపర్ బ్యాటర్. ఫిట్ నెస్ సాధించాడు.
ఐపీఎల్ సీజన్ ముగిసిన తరువాత యాషెస్ టోర్నమెంట్ ను ఆడాల్సి ఉంది ఇంగ్లాండ్ జట్టు. ఈ ప్రతిష్ఠాత్మక యాషెస్ కోసం సన్నద్ధం కావాల్సి ఉన్న నేపథ్యంలో ఐపీఎల్ సీజన్ కు దూరం కావాలని నిర్ణయించుకున్నాడు.

సెంచరీ కూడా..
ఐపీఎల్ సీజన్ లల్లో నిలకడగా రాణిస్తోన్నాడు జానీ బెయిర్ స్టో (Bairstow). 2019లో ఐపీఎల సీజన్ లో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటివరకు నాలుగు సీజన్లు కంటిన్యూగా ఆడాడు. ఈ నాలుగు సీజన్లల్లో కలిపి 39 మ్యాచ్ లను ఆడాడు. 1,291 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ 142.65తో బౌలర్లకు చుక్కలు చూపాడు. అతని బ్యాటింగ్ యావరేజ్ 35.86. ఒక సెంచరీ కూడా అతని ఖాతాలో ఉంది. తొమ్మిది హాఫ్ సెంచరీలను బాదాడు.












Click it and Unblock the Notifications