IPL 2023: గవాస్కర్ నుంచి సెహ్వాగ్ వరకు..హర్భజన్ నుంచి మిథాలీ రాజ్ దాకా ఫుల్ స్వింగ్ ఫుల్ జోష్..!
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) కోసం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. మార్చి 31వ తేదీ నుంచి ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans)తో చెన్నై సూపర్ కింగ్స్ (CSK)తలపడనుంది. ఐపీఎల్ 16 సీజన్ తొలి మ్యాచ్‌కు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదిక కానుంది. కోవిడ్ కారణంగా మ్యాచ్‌లు కొన్ని వేదికలకే పరిమితం కాగా.. ఈ సీజన్ నుంచి హోమ్ గ్రౌండ్‌తో పాటు ఇతర ప్రత్యర్థి గ్రౌండ్స్ పై కూడా మ్యాచ్‌లు జరుగనుండటంతో అభిమానులు మరింత ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు.
ఇక ఐపీఎల్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా స్టార్‌స్పోర్ట్స్ ఛానెల్ ఉంది. అయితే టీవీలో చూసేవారికి మరింత ఉత్సాహపరిచేందుకు స్టార్ కామెంటేటర్స్ ఉంటారు. అఫీషియల్ బ్రాడ్‌కాస్టర్‌గా ఉన్న స్టార్ స్పోర్ట్స్ యాజమాన్యం ఈ ఐపీఎల్ సీజన్ 16కు కామెంటేటర్స్ జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు ఇతర విదేశీ మాజీ క్రికెటర్లు ఉన్నారు. ఇప్పటికే గత ఐపీఎల్ సీజన్‌లకు వ్యాఖ్యాతగా వ్యవహరించిన వారితో పాటు కొందరు కొత్త కామెంటేటర్స్ కూడా యాడ్ అయ్యారు.

ఈ మధ్యే రిటైర్ అయిన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ఆరోన్ ఫించ్ ఐపీఎల్ కొత్త కామెంటేటర్స్ జాబితాలో ఉన్నాడు. ప్రస్తుతం భారత్ ఆసీస్ మధ్య జరుగుతున్న వన్డే టోర్నీకి కామెంటేటర్‌గా ఫించ్ వ్యవహరిస్తున్నాడు. సాతాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్స్ కలిస్ ఈ సారి తొలిసారిగా ఐపీఎల్‌లో తన కామెంటరీతో అలరించనున్నాడు. ఇక మంచి పాపులారిటీ కలిగిన కెవిన్ పీటర్సన్, డానీ మారిసన్, డేవిడ్ హస్సీ, ఇమ్రాన్ తాహిర్, మాథ్యూ హేడెన్‌లు కూడా ఐపీఎల్ కామెంటేటర్ల జాబితాలో ఉన్నారు. ఇక ఐపీఎల్ జట్లకు గతంలో కోచ్‌లుగా వ్యవహరించిన టామ్ మూడీ, డేనియేల్ వెటోరి, సైమన్ కాటిచ్‌లు కూడా మ్యాచ్ పై తమ అనాలసిస్ లేదా విశ్లేషణను అందిస్తారు.

భారత్ నుంచి లెజెండరీ క్రికెటర్ సునీల్ గవాస్కర్‌తో పాటు వీరేంద్ర సెహ్వాగ్, మొహ్మద్ కైఫ్, హర్భజన్ సింగ్, టీమిండియా మాజీ కెప్టెన్ మిథాలీ రాజ్‌లు ఉన్నారు.ఇక ఇర్ఫాన్ పఠాన్ కూడా తన సోదరుడు యూసఫ్ పఠాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.ఇక మురళీ విజయ్‌తో పాటు కేరళ మాజీ స్పీడ్‌స్టర్ శ్రీశాంత్, లక్ష్మీపతి బాలాజీ, సుబ్రహ్మణ్యం బద్రీనాథ్, కూడా జాయిన్ అవుతున్నాడు. వెటరన్ క్రికెటర్లు క్రిష్ శ్రీకాంత్, సందీప్ పాటిల్‌లు కూడా ఈ సారి ఐపీఎల్‌లో తమ విశ్లేషణలు, వాయిస్‌తో జోష్ నింపనున్నారు.












Click it and Unblock the Notifications