IPL auction: విదేశీ క్రికెటర్లపైనే మోజెక్కువ: హిస్టరీలో ఫస్ట్‌టైమ్: ముగ్గురికి రూ.14 కోట్లు ప్లస్

చెన్నై: చెన్నై: ఇండియన్ ప్రీమియర్ లీగ్-2021 మెగా టోర్నమెంట్‌కు సంబంధించిన మినీ వేలంపాట హాట్‌గా సాగుతోంది. చెన్నై గ్రాండ్ చోళ హోటల్.. దీనికి వేదికైంది. తాము ఆరాధించే క్రికెటర్లను ఏ ఫ్రాంఛైజీలు బుట్టలో వేసుకుంటాయోననే ఉత్కంఠత నెలకొంది. మెరికెల్లాంటి కొందరు బ్యాట్స్‌మెన్లు, ఆల్‌రౌండర్ల పేర్లు వేలంపాట లిస్ట్‌లో చేరడం..ఈ మినీ వేలంపాటకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ మినీ వేలం పాట ద్వారా 61 మంది క్రికెటర్లను ఎనిమిది ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయనున్నాయి.

 మూడుసార్లు 14 కోట్ల మార్క్..

మూడుసార్లు 14 కోట్ల మార్క్..


ఇందులో 22 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. దీనికోసం 196.6 కోట్ల రూపాయలను ఖర్చు చేయబోతోన్నాయి. మొత్తం 292 మంది క్రికెటర్లు మినీ ఆక్షన్ కోసం తమ పేర్లను నమోదు చేసుకున్నారు. ఈ సారి ఐపీఎల్ మినీ వేలంపాటలో కొన్ని అద్భుతాలు చోటు చేసుకుంటున్నాయి. ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారిగా ఓ అరుదైన ఘటన ఈ సారి మినీ ఆక్షన్‌లో చోటు చేసుకుంది. ఏదైనా ఓ ఫ్రాంఛైజీ మేనేజ్‌మెంట్.. ఓ క్రికెటర్‌ను 14 కోట్లు పెట్టి కొనుగోలు చేస్తే.. అదే పెద్ద అద్భుతం అయ్యేది ఇప్పటిదాకా. ఈ సారి దానికి మించిన పరిణామాలు చోటు చేసుకున్నాయి.

ముగ్గురూ విదేశీ క్రికెటర్లే..

ముగ్గురూ విదేశీ క్రికెటర్లే..

14 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తాన్ని ధారపోయడం అలవాటుగా మారినట్టయింది. ఈ సారి ఐపీఎల్ ఆక్షన్‌లో ఏకంగా ముగ్గురు క్రికెటర్లు 14 కోట్ల రూపాయలు లేదా అంతకంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయారు. ఆ ముగ్గురు కూడా విదేశీ ఆటగాళ్లే కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఫ్రాంఛైజీలు, టీమ్ మేనేజ్‌మెంట్లు.. తాము తీసుకోదలిచిన విదేశీ ఆటగాళ్లను సొంతం చేసుకోవడానికి ఎంత మొత్తమైనా ధారపోస్తారనేది మరోసారి రుజువైంది.

మ్యాక్స.. మోరిస్..

మ్యాక్స.. మోరిస్..

తొలుత గ్లెన్ మ్యాక్స్‌వెల్ రికార్డు రేటుకు అమ్ముడుపోయాడు. 14 కోట్ల 25 లక్షల రూపాయలకు అతణ్ని కొనుగోలు చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ సారి మినీ వేలంపాటలో ఇదే అత్యధిక రేటు పలుకుతుందని అందరూ అంచనా వేశారు. ఆ కొద్దిసేపటికే దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్.. ఈ రికార్డును తుత్తునీయలు చేశాడు. అత్యధిక రేటుకు అమ్ముడుపోయాడు. రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంఛైజీ భారీ రేటుకు అతణ్ని సొంతం చేసుకుంది. ఏకంగా 16 కోట్ల 25 లక్షలకు మోరిస్‌ను తీసుకుంది.

ఆసీస్ రిచర్డ్‌సన్..

ఆసీస్ రిచర్డ్‌సన్..


ఈ రేట్ రన్.. ఇక్కడితో ఆగలేదు. మరోసారి 14 కోట్ల రూపాయల మార్క్‌ను అందుకుంది. ఆస్ట్రేలియాకే చెందిన యంగ్ క్రికెటర్ ఝైరే రిచర్డ్‌సన్‌ను 14 కోట్ల రూపాయల క్లబ్‌లో చేరాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని 14 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. 2015లోనే డొమెస్టిక్ క్రికెట్‌తో ఎంట్రీ ఇచ్చిన రిచర్డ్‌సన్.. ఆల్‌రౌండర్‌గా ఎదుగుతున్నాడు. కుడిచేతి వాటం బ్యాట్స్‌మెన్, కుడిచేతి వాటం ఫాస్ట్ బౌలర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో గుర్తింపు పొందాడు. టీ20 స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. అతని బ్యాటింగ్, బౌలింగ్ శైలి టీ20 ఫార్మట్ క్రికెట్‌కు అతికినట్టు సరిపోతోందని అంటుంటారు ఎక్స్‌పర్ట్స్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+