ఈ షేరుపై రూ.10వేలు పెట్టారు... రూ.10 లక్షలు పట్టుకెళ్లారు
ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టడం సలువైనప్పటికీ అందరికీ లాభాలు రావడం అనేది అంత సులువేం కాదు. మార్కెట్లపై పూర్తి అవగాహనతో ఉంటూ, నిపుణుల సలహాలు తీసుకుంటూ ఇన్వెస్ట్ చేస్తుండాలి. అలాగే పోర్ట్ ఫోలియోను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తుండాలి. తద్వారా అనుకున్న లక్ష్యానికి చేరుకోవచ్చు.స్టాక్ మార్కెట్లలో కొన్ని మల్టీబ్యాగర్ స్టాక్స్ పెట్టుబడిదారులను లక్షాధికారులను చేస్తుంటాయి.

తక్కువగా పెట్టిన పెట్టుబడులను ఎన్నో రెట్లు పెంచి ఇస్తుంటాయి. అలాంటి ఓ స్టాక్ గురించి తెలుసుకుందాం. అదేమిటంటే జేబీఎం ఆటో (JBM Auto) కంపెనీ. ఇందులో రూ.10వేలు పెట్టినవారు రూ.10 లక్షలు పట్టుకెళ్లారు. ఈ కంపెనీ తన పెట్టుబడిదారులకు బంపర్ రిటర్న్స్ ఇచ్చింది. 10 సంవత్సరాల క్రితం ఈ కంపెనీలో రూ.10వేలు పెట్టుబడిగా పెట్టినవారికి తాజాగా రూ.10 లక్షలకుపైగా వచ్చాయి. అయితే ఎంతో ఓపికతో ఎదురుచూసినందుకే వారికి ఈ ఫలితాలు దక్కుతున్నాయి. గత మూడు సంవత్సరాల కాలం చూసుకున్నా మంచి లాభాలే వచ్చాయి. మూడేళ్లలో ఈ షేరు 1192 శాతం ఇచ్చింది. 5 సంవత్సరాల కాలంలో 270 శాతం పెరిగింది.

జేబీఎం ఆటో సేల్స్ పది సంవత్సరాల కాలంలో మూడురెట్లు పెరిగింది. 2013లో కంపెనీ సేల్స్ రూ.1364 కోట్లు ఉండగా, 2023లో రూ.3857 కోట్లకు చేరింది. లాభం కూడా రూ.57 కోట్ల నుంచి రూ.124 కోట్లకు పెరిగింది. మార్చి 31తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం 8 శాతం పడిపోయింది. ఈ కంపెనీ ఆటోమోటివ్ ప్రోడక్ట్స్, సబ్ సిస్టమ్స్ తయారు చేయడంతోపాటు ఎయిర్ ట్యాక్, ఛేసిస్, సస్పెన్షన్ పార్ట్స్, క్రాస్ కార్ బీమ్, ఎగ్జాస్ట్ సిస్టమ్స్, ఫ్యూయల్ ట్యాక్స్, హీట్ షీల్డ్స్ వంటివి కూడా తయారుచేస్తుంది.












Click it and Unblock the Notifications