బతుకమ్మ పండగ: హుజురాబాద్‌లో వినూత్నంగా ఆట..
బతుకమ్మ సంరంభం వచ్చేసింది. నేటితో పూల పండగ సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఎంగిలిపూల బతుకమ్మతో వేడుకలు వైభవంగా మొదలయ్యాయి. కరోనా తర్వాత జరుగుతున్న పండగ ఇందీ. తొలిరోజు బతుకమ్మ వేడుకల్లో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఒక్కొక్కరు ఒకలా పాటలు పాడుతూ ఆట ఆడారు. కొందరు వినూత్నంగా ట్రై చేశారు.
హుజూరాబాద్ ప్రతాపవాడతో మహిళలు వినూత్న రీతిలో బతుకమ్మ ఆడారు. సిలిండర్ ధరల పెరుగుదలను నిరసిస్తూ మధ్యలో గ్యాస్ సిలిండర్ పెట్టి బతుకమ్మ ఆడారు. గ్యాస్ ధరల పెరుగుదలపై నిరసన తెలిపారు. గ్యాసుల ధరలు పెంచారు ఉయ్యాల్లో.. గరీబు చేస్తున్రు ఉయ్యాలో.. పెట్రోల్ ధర పెంచి ఉయ్యాల్లో ప్రాణాలు తీస్తున్రు ఉయ్యాల్లో.. కేంద్రం మోసాలు ఉయ్యాలో.. ఇక చెల్లనియ్యం ఉయ్యాల్లో' అంటూ పాటలు పాడారు.

బతుకమ్మల మధ్యలో సిలిండర్ పెట్టి ఆటలాడిన వీడియోలు.. సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇదిలా ఉంటే దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలతోపాటు వంటగ్యాసు ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దీంతో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ కట్టెలపొయ్యిపై వంట చేసుకునే రోజులు వస్తాయేమోనని మహిళలు అంటున్నారు.
మరోవైపు ఉద్యోగాలకు సంబంధించి బతుకమ్మ పాట ఒకటి వైరల్ అయ్యింది. మరో పాటలో ఈటలకు ఓటు వేయాలని ట్రోల్ చేస్తున్నారు. దీనికి కౌంటర్‌గా టీఆర్ఎస్ కూడా మరో సాంగ్ ట్రై చేసింది. మరోవైపు తెలంగాణ జాగృతి ఆద్వర్యంలో అల్లిపూల వెన్నెల బతుకమ్మ పాటను తీశారు. గౌతమ్ మీనన్ డైరెక్ట్ చేయగా.. ఏఆర్ రహమాన్ స్వరాలు సమకూర్చారు. ఆ పాటను నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, డైరెక్టర్ గౌతమ్ మీనన్‌తో కలిసి విడుదల చేశారు. అల్లిపూల వెన్నెల సాంగ్ శ్రోతలను ఆకట్టుకుంటుంది. తన మ్యూజిక్ మాయతో ఏఆర్ రెహామాన్.. గౌతమ్ మీనన్ ప్రేక్షకులను మాయ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుపుకునే పండగ బతుకమ్మ. రకరకాల పువ్వులను పేర్చి... అమ్మవారిగా తలచి పూజిస్తూ.. ఆడుతూ పాడుతూ జరుపుకునే ఈ పండగను సంబరంగా జరుపుకుంటారు.
జాగృతి రూపొందించిన పాటపై కాస్త విమర్శలు వచ్చాయి. ఇంత ప్రతిష్టాత్మకంగా తీసిన.. ఇక్కడి రుచి, వాసన లేదని పెదవి విరుస్తున్నాయి. నిజానికి పాటలో తెలంగాణం ఎక్కడ కనిపించలేదు కూడా.. పాట కూడా స్లోగా ఉండటం కాస్త నిరాశకు గురిచేసింది.












Click it and Unblock the Notifications