ఈటల ప్రజా జీవన యాత్ర.. వీర తిలకం దిద్ది, సాగనంపిన సతీమణీ జమున
మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ ప్రజా జీవన పాదయాత్రను ప్రారంభించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో గల కమలాపూర్ మండలం బత్తినవారిపల్లి నుంచి యాత్ర షురూ అయ్యింది. మొదటి రోజు శనిగరం, మాదన్నవీధి, గురిపర్తి, శ్రీరాములపేట, అంబల గ్రామాల మీదుగా పాదయాత్ర కొనసాగుతుంది. ఇవాళ అంబలలో ఈటల రాజేందర్ బస చేస్తారు. మరునాడు షెడ్యూల్ ప్రకారం యాత్ర జరుగుతుంది.
బత్తినవానిపల్లి శ్రీ హనుమాన్ దేవస్థానం నుంచి ఈటల రాజేందర్ పాదయాత్ర ప్రారంభం అయ్యింది. ఈటల సతీమణి జమున మంగళహారతి ఇచ్చి, వీర తిలకం దిద్దారు. పాదయాత్ర కోసం బీజేపీ శ్రేణులు భారీగా తరలివచ్చారు. బీజేపీ నేత వివేక్ సహా నేతలు ఉన్నారు. నియోజకవర్గంలో పలు గ్రామాల మీదుగా 23 రోజుల పాటు పాదయాత్ర కొనసాగుతుంది. 107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం ఈటల రాజేందర్ పాదయాత్ర చేస్తారు.
Recommended Video

అందరి అండదండలు, ప్రేమాభిమానాలు తనకు కావాలని ఈటల రాజేందర్ కోరారు. ఆత్మగౌరవ ప్రస్థానానికి ఇదే తొలి అడుగు అని ఆయన చెప్పారు. ప్రాణం పంచే ప్రజల ప్రత్యక్ష దీవెనలు అందుకోవడానికి పాదయాత్రకు శ్రీకారం చుడుతున్నానని అన్నారు. టీఆర్ఎస్‌ను వీడి బీజేపీలో చేరిన తర్వాత ఈటల రాజేందర్ నియోజకవర్గంలో గల ప్రజల ముందుకు వచ్చారు. కాగా ఇవాళ్టి నుంచి పాదయాత్ర చేపట్టారు. తనకు ఇప్పటివరకు అండగా నిలిచారని.. ఇకపై కూడా నిలవాలని చెప్పారు.












Click it and Unblock the Notifications