Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పేదల పక్షపాతి గులాబీ దళం.. బీజేపీ అంటేనే ధరల పెంపు: హరీశ్ రావు

హుజురాబాద్ బై పోల్‌లో మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది. బీజేపీ- టీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉండనుంది. ఆ పార్టీ నేతల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. గురువారం మంత్రి హరీశ్ రావు ఆరోపణలకు మరింత పదును పెట్టారు. ధరలు పెంచే బీజేపీ కావాలా... పేద ప్రజలను ఆదుకునే టీఆర్‌ఎస్‌ కావాలా హుజూరాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఆలోచించుకోవాలని కోరారు. హుజూరాబాద్‌ సమీపంలోని రంగనాయకుల గుట్ట వద్ద పెద్దమ్మ గుడికి మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి భూమిపూజ చేశారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పేదల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. హుజూరాబాద్‌ నియోజకవర్గానికి సీఎం కేసీఆర్‌ నాలుగు వేల ఇళ్లు ఇచ్చినా, ఇక్కడ ఉన్న మంత్రి ఒక డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. అలాంటి ఈటల రాజేందర్‌ను ఎందుకు గెలిపించాలని ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వం నెలనెల గ్యాస్‌ ధర పెంచి ఇచ్చే సబ్సిడీ తగ్గిస్తుందన్నారు. నిత్యావసర ధరలు పెంచి బీజేపీ పేద ప్రజల మీద భారం వేస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ ఇంకా రెండేళ్లు అధికారంలో ఉంటుందని, ఈటల రాజేందర్‌ గెలిచినా ఇక్కడ అభివృద్ధి జరగదని హరీష్‌రావు చెప్పారు.

minister harish rao slams bjp

మంత్రులు హరీశ్‌రావు, గంగుల కమలాకర్ హుజురాబాద్‌లోనే మకాం వేసి కార్యకర్తల్లో కొత్త జోష్‌ నింపుతున్నారు. ఇదివరకు చేసిన అభివృద్ది పనులను వివరిస్తూ.. టీఆర్ఎస్‌ పార్టీలో తనకు జరిగిన అవమానాన్ని ప్రజలకు చెప్పుకుంటూ వారి మద్దతు పొందే ప్రయత్నం చేస్తున్నారు. టీఆర్ఎస్‌కు రాజీనామా చేసినప్పటి నుంచి నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజలతో మమేకమవుతున్నారు. అటు ఈటల భార్య జమున సైతం హుజురాబాద్‌లోని పలుగ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. మరి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో రానున్న రోజుల్లో తేలిపోనుంది. కాంగ్రెస్ కూడా బలమైన అభ్యర్థి కోసం చూస్తోంది. అందులో భాగంగానే కొండా సురేఖ పేరు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా వారి సంగతి ఏంటీ అని ప్రశ్నిస్తున్నారు. హుజురాబాద్‌లో ఇప్పటికే అర్హులను ఎంపిక చేసి.. నగదు కూడా జమ చేశారు. ఈ క్రమంలోనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+