కరీంనగర్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రులకు మాస్క్ వద్దా.. సోషల్ మీడియాలో వైరల్.. నెటిజన్ల ఫైర్

|
Google Oneindia TeluguNews

చట్టం అందరికీ ఓకేలా ఉంటుంది.. ఉండాలి. నేతలకు ఒకవిధంగా.. సామాన్యులకు మరోలా ఉండకూడదు. అవును హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలో ప్రచార పర్వం ఊపందుకుంది. మంత్రులు కూడా క్యాంపెయిన్ చేస్తున్నారు. అయితే వీణవంకలో మంత్రులు హరీశ్ రావు, గంగుల కమలాకర్ బైక్ ర్యాలీ తీశారు. ఇంతవరకు.. ఇక్కడే ట్విస్ట్ నెలకొని ఉంది.

వైరల్

వైరల్

మంత్రుల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. వారిద్దరూ హెల్మెట్ కదు కదా.. కనీసం మాస్క్ కూడా పెట్టుకోలేదు. అసలే కరోనా కాలం.. పైగా ప్రచారం వైరస్ మరింత వ్యాపిస్తే సంగతి ఏంటీ అనే ప్రశ్న తలెత్తుతుంది. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మంత్రులకు నిబంధనలు వర్తించవా అని నెటిజన్లు అడుగుతున్నారు.

ప్రచార పర్వం..

ప్రచార పర్వం..

ఇటు హుజురాబాద్ బై పోల్ వేళ సీరియస్ నెస్ ఎక్కువ అవుతుంది. ప్రధాన పార్టీల మధ్య విమర్శలు మరింత ముదురుతున్నాయి. వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. అందుకోసమే ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిధలా ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికైతే షెడ్యూల్ రాలేదు.. కానీ నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఎరులై పారుతోందని విశ్వసనీయంగా తెలిసింది. ఎన్నికల్లో విజయం ఈటల రాజేందర్‌కు జీవన్మరణ సమస్య కాగా.. టీఆర్ఎస్ కూడా ప్రతిష్టత్మకంగానే తీసుకుంది. కాంగ్రెస్ కూడా అదేవిధంగా పోటీ చేయనుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపనుంది. బై పోల్ ఏమో కానీ.. నియోజకవర్గంలో వందల కోట్లను అభ్యర్థులు గుమ్మరించే ఛాన్స్ ఉంది. మద్యం ఏరులై పారగా.. నగదు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు.

పథకాలే పథకాలు

పథకాలే పథకాలు

మరోవైపు హుజురాబాద్ బై పోల్ నేపథ్యంలోనే దళితబంధు పథకం తెరపైకి వచ్చింది. పథకంపై విపక్షాలు గుర్రు మంటున్నాయి. దళితులు ఇప్పుడే గుర్తుకొచ్చారా అని అడుగుతున్నారు. ఎన్నికలు/ బై పోల్ నేపథ్యంలో వారు గుర్తుకు వస్తారా అని అడుగుతున్నారు. లేదంటే బడుగు బలహీన వర్గాలు గుర్తుకురారా అని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ చెప్పే అబద్దాలను ప్రజలు వినే స్థితిలో లేరని చెప్పారు. వారు అన్నీ గమనిస్తున్నారని వివరించారు. చేసిన న్యాయ, అన్యాయలను గుర్తుకు ఉంచుకుంటారని తెలిపారు. సమయం చూసి బుద్ది చెబుతారని.. బై పోల్‌లో గుణపాఠం తప్పదని అంటున్నారు. కానీ అధికార పార్టీ మాత్రం సంక్షేమ పథకాలే తమ పాలిట విజయం చేకూరుస్తాయని చెబుతున్నారు. తాము చేసిన పనులే.. విజయానికి నాంది పలుకుతాయని తెలిపారు. దళిత బంధు ఇతర పథకాలపై ప్రభుత్వం.. ఏమీ చేయడం లేదని ప్రతిపక్షాలు గట్టి నమ్మకంతో ఉన్నాయి. అయితే హుజురాబాద్ ఉప ఎన్నికలో ప్రజలు ఏ వైపు ఉంటారో చూడాలీ మరీ. టీఆర్ఎస్ లేదా.. విపక్షాల వైపు చూస్తారో చూడాలీ మరీ. బై పోల్ చుట్టూ రాష్ట్రంలో రాజకీయాలు నడుస్తున్నాయి.

Recommended Video

Spl Interview with BC leaders On BC Bandhu Demand
ఉంటుందా.. ఊడుతుందా..

ఉంటుందా.. ఊడుతుందా..

దళిత బంధు పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. హుజురాబాద్ ఎన్నిక తర్వాత కూడా పథకం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో దళితులు ఎక్కువగా ఉన్నందున.. పథకం తెరపైకి తీసుకొచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనికి సంబంధించి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో నిధులు కూడా రిలీజ్ చేశారు. అయితే మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనే ప్రశ్న వస్తోంది. బై పోల్ కోసం హుజురాబాద్‌లో కొందరినీ ఎంపిక చేసి.. ఇచ్చిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరీ మిగతా ప్రాంతాల సంగతి ఏంటీ అనేది ఇక్కడ ప్రశ్న.. రాష్ట్రంలో గల నిరుపేద దళితులు.. దళిత బంధు పథకం కోసం ఆప్లై చేసుకోవాలా... నిజంగానే నగదు ఇస్తారా అనే సందేహాం ప్రతీ ఒక్కరిలో మెదలుతుంది. కానీ దీనికి సంబంధించి సమాధానం కావాలంటే కాలామే చెప్పాలి. ఎందుకంటే బై పోల్ జరిగే వరకు ఏ విషయంపై క్లారిటీ ఉండదు. ఎన్నిక, ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు.. ఎందుకంటే పాలకులు బడుగు, బలహీనవర్గాలను పట్టించుకోవడం అరుదుగానే ఉంటుంది. మరీ దళిత బంధు విషయంలో అలా జరుగుతుందా.. లేదో చూడాలీ

English summary
ministers harish rao, gangula kamalakar not wear a mask for huzurabad by poll campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X