Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

వీడియో: కాంగ్రెస్ సభలో టాలీవుడ్ స్టార్ హీరో కూతురు

Telangana Lok Sabha elections 2024: లోక్‌సభ ఎన్నికల గడువు సమీపించిన నేపథ్యంలో తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. రోడ్ షోలు, బహిరంగ సభలు, ఆత్మీయ సమావేశాలు, ఇంటింటి ప్రచారాలతో రాష్ట్రం మొత్తం హోరెత్తిపోతోంది.

తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలకు మే 13వ తేదీన పోలింగ్ నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ ముగుస్తుంది. జూన్ 4వ తేదీన ఫలితాలు వెలువడుతాయి. ప్రస్తుతం 17 లోక్‌సభ స్థానాల్లో అత్యధికం బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నాయి. తొమ్మిది స్థానాల్లో భారత్ రాష్ట్ర సమితి జెండా ఎగురుతోంది.

Tollywood actor Venkatesh s daughter Aashritha campaign for Congress in Khammam

నాలుగు చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించారు. మరో మూడింటిని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఏఐఎంఐఎం ఒక స్థానాన్ని నిలబెట్టుకున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో తన సీట్ల సంఖ్యను భారీగా పెంచుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు సాగిస్తోంది. ఈ క్రమంలో గెలుపు గుర్రాలకు టికెట్లు ఇచ్చింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు.. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా పర్యటిస్తోన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో పాల్గొంటోన్నారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన పట్టును నిలుపుకోవడం ఇప్పుడు కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ఈ క్రమంలో ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ప్రముఖ నటుడు, విక్టరీ వెంకటేష్.. కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతోన్నారు. ఈ నెల 5వ తేదీన ఆయన ఖమ్మంలో పర్యటించే అవకాశం ఉంది. అనంతరం ఎన్నికల ప్రచారానికి తెర పడేంత వరకూ రోజూ ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తారని సమాచారం.

Tollywood actor Venkatesh s daughter Aashritha campaign for Congress in Khammam

ఖమ్మం లోక్‌సభ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న రామసహాయం రఘురామరెడ్డి.. వెంకటేష్‌కు స్వయానా వియ్యంకుడు కావడమే దీనికి కారణం. వెంకటేష్ కుమార్తె ఆశ్రిత.. రఘురామరెడ్డి పెద్ద కోడలు. ఆయన కుమారుడు వినాయక్ రెడ్డిని ఆశ్రిత పెళ్లి చేసుకున్నారు. బంధుత్వం ఉండటం వల్ల వెంకటేష్ ఈ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారు.

ఆశ్రిత.. ఎన్నికల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కండువాను కప్పుకొన్నారు. పొలిటికల్ స్పీచ్ ఇచ్చారు. మే 13వ తేదీన జరగబోయే పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి, రఘురామరెడ్డిని గెలిపించుకుందామని విజ్ఞప్తి చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+