కుప్పంలో భారీ పేలుడు: ఇల్లు ధ్వంసం; దంపతుల పరిస్థితి విషమం!!
చిత్తూరు జిల్లా కుప్పంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఒక్కసారిగా కుప్పం మొత్తం ఉలిక్కిపడింది. పెద్ద పల్లి గంగమాంబ దేవస్థానం సమీపంలో ఉన్న ఒక ఇంట్లో ఒక్కసారిగా నిన్న అర్ధరాత్రి పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలు భయాందోళనకు గురయ్యారు.
ఏం జరిగిందా అని బయటకు వచ్చి చూసేసరికి ఓ ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. ఆ ఇంట్లో నివసిస్తున్న దంపతులు తీవ్ర గాయాల పాలై పడి ఉన్నారు.మురుగేష్, ధనలక్ష్మి అనే ఇద్దరు భార్య భర్తలు స్టీల్ సామాన్ల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అసలు ఏం జరిగిందో తెలియదు గానీ వారి ఇంటి వద్ద పేలుడు సంభవించడం, వారిద్దరూ తీవ్ర గాయాల పాలు కావడం జరిగింది.

దీంతో స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన తెలిసిన వెంటనే పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. దుండగులు పేలుడు పదార్థాలను ఉపయోగించడం వలన ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.
గుర్తుతెలియని దుండగులు ఆ దంపతులు నివసిస్తున్న ఇంటి గుమ్మం ముందు నాటు బాంబులు, జిలిటెన్ స్టిక్స్ పెట్టి పేల్చినట్టుగా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. అయితే వారి ఇంటి ముందు పేలుడు పదార్థాలు పేల్చిన వారు ఎవరు? అసలు వారికి వీరి మధ్య ఉన్న గొడవ ఏమిటి? ఎందుకు వీరిని చంపాలని వారు భావించారు వంటి వివరాలు తెలియాల్సి ఉంది.
దంపతులు టార్గెట్ చేసిన వారే పేలుళ్ళకు పాల్పడ్డారా లేదా ఇంకేదైనా కారణం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గాయపడిన దంపతుల పరిస్థితి విషమంగా ఉండటంతో వారు ఈ ఘటనపై మాట్లాడే పరిస్థితి లేదు. కుప్పంలో ఇళ్ల మధ్య భారీ పేలుడు సంభవించడంతో స్థానికంగా ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. ప్రజలలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications