వైసీపీ కార్యకర్తలపై దాడి, ఇద్దరు మృతి.. కర్నూలులో ఉద్రిక్తత..

రాయలసీమ ఒక్కసారి ఉలిక్కిపడింది. కర్నూలు జిల్లాలో జరిగిన దాడిలో ఇద్దరు అధికార పార్టీకి చెందిన కార్యకర్తలు చనిపోయారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇన్నాళ్లు స్తబ్దుగా ఉండగా.. మరోసారి హై టెన్షన్ నెలకొంది. పోలీసులు రంగంలోకి దిగారు. పరిస్థితిని దగ్గర ఉండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటివరకు సిచుయేషన్ అండర్ కంట్రోల్ అని చెబుతున్నారు.

బీజేపీ కార్యకర్తలు దారుణానికి తెగబడ్డారు. కర్నూలు జిల్లా కౌతాళం మండలంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలపై వేట కొడవళ్లతో దాడి చేశారు. కామవరం గ్రామంలో గత కొద్ది రోజుల నుంచి శివప్పకు సంబంధించిన భూవివాదం నడుస్తోంది. ఇటీవల కోర్టు కూడా భూ వివాదం విషయంలో శివప్పకే అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇది తట్టుకోలేని బీజేపీ నేతలు ప్రెస్‌మీట్లు ఏర్పాటు చేసి వైఎస్సార్‌సీపీ నేతలు భూకబ్జాలకు పాల్పడుతున్నారని శివప్పుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.

two ysrcp leaders are dead

ఆరోపణలు చేస్తున్న బీజేపీ నేతలతో మాట్లాడటానికి వెళ్లిన శివప్ప, ఈరన్నపై వేట కొడవళ్లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అంతటితో ఆగకుండా పెట్రోల్‌తో దాడి చేశారు. దాడిలో శివప్ప, ఈరన్న సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. బీజేపీ కార్యకర్తలు మాత్రం అక్కడి నుంచి జారుకున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. హత్య గురించిన సమాచారం సేకరించారు. ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. హత్య చేసిన వారిని అరెస్ట్ చేస్తామని పోలీసులు స్పష్టంచేశారు.

దాడి తర్వాత పరిస్థితి చేయి దాటకుండా కౌతాళంలో పోలీసు బలగాలను మొహరించారు. రౌడీ షీటర్లు, ఇతరులపై ఫోకస్ చేశారు. పరిస్థితిని అధికారులు ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+