Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

జగన్ పై పోటీ.. రఘురామ షాకింగ్ సర్వే ; వివేకా కేసులో సాయిరెడ్డిని ప్రశ్నించాలని సంచలనం

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు నిత్యం ఏదో ఒక విధంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తూనే ఉన్నారు. ఏపీలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలపై, అలాగే వైసిపి సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలపై, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని ఇరకాటంలో పెట్టేలా ఎంపీ రఘురామ కృష్ణంరాజు రోజుకో రకంగా జగన్ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు . ఇక తాజాగా అనేక విషయాలపై మాట్లాడిన ఎంపీ రఘురామ కృష్ణంరాజు నరసాపురంలో ఇప్పుడు ఎన్నికలు జరిగితే సీఎం జగన్, తాను పోటీ చేస్తే తానే గెలిచే అవకాశాలు ఉన్నాయి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జగన్ కు తనకు సర్వేలో వ్యత్యాసం 19 శాతం మాత్రమే
నరసాపురం లో జగన్ ను తాను పోటీ చేస్తే ఎలా ఉంటుందన్న దానిపై సర్వే చేశారని జగన్ కు, తనకు మధ్య సర్వేలో 19 శాతమే వ్యత్యాసం ఉందని ఎంపీ రఘురామ కృష్ణంరాజు వెల్లడించారు. తన వ్యాఖ్యల ద్వారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చరిష్మా ప్రజల్లో తగ్గిందని రఘురామ కృష్ణంరాజు స్పష్టం చేశారు. ఇదే సమయంలో చిత్తూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు, మంత్రి పెద్దిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి మినహా మరెవరూ మళ్లీ గెలవరని వ్యాఖ్యలు చేశారు రఘురామకృష్ణంరాజు. తప్పుడు ప్రచారాలు ఆపేందుకు సర్వే వివరాలు చెబుతున్నానని పేర్కొన్న రఘురామ సర్వేపై ఆసక్తికర అంశాలు చెప్పారు.

MP Raghurama sensation on compete against Jagan; sai reddy in YS Viveka murder case

ఇప్పుడు ఎన్నికలు జరిగితే 50 సీట్లు కూడా వైసీపీకి రావు
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చంద్రబాబుకు 60 శాతం ప్రజల మద్దతు ఉందని పేర్కొన్నారు . ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మొత్తం 175 అసెంబ్లీ స్థానాలలో 50 స్థానాల నుంచి వైసీపీకి రావని రఘురామ కృష్ణం రాజు జోస్యం చెప్పారు. ఇక పశ్చిమ గోదావరి జిల్లాలో ఒకరిద్దరు తప్ప వైసిపి ఎమ్మెల్యేలందరికీ ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. కానీ వైసీపీ నేతలు ఎప్పుడు ఎన్నికలు జరిగినా విజయం మాదే అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు జరిగిన ఎన్నికలే అందుకు ఉదాహరణ అని చెప్తున్నారు.

విజయసాయికి వివేకాకు గుండెపోటు వచ్చిందని చెప్పింది ఎవరు?
ఇదే సమయంలో వైయస్ వివేకా హత్య కేసుపై కూడా రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్నటికి మొన్న వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీలక సమాచారం ఇచ్చిన వారికి ఐదు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని సిబిఐ ప్రకటన చేసిన నేపథ్యంలో, ఐదు లక్షలు ఏ మూలకు సరిపోతాయని ప్రశ్నించిన రఘురామ కోటి రూపాయల రివార్డు ఇవ్వాలని పేర్కొన్నారు. ఇక తాజాగా మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డికి గుండెపోటు వచ్చినట్లు విజయసాయి రెడ్డికి ఎవరు చెప్పారని ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

సీబీఐ ముందు విజయసాయిని ప్రశ్నించాలి, అమరరాజా కాలుష్యం సరే .. నాసిరకం మద్యం మాటేంటి ?
వివేకా హత్య కేసును దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులు ముందుగా విజయసాయిరెడ్డిని ప్రశ్నించాలని రఘురామకృష్ణంరాజు డిమాండ్ చేశారు. ఇక అమర రాజా బ్యాటరీస్ వ్యవహారంపై మాట్లాడిన రఘురామకృష్ణంరాజు, చిత్తూరు జిల్లాలో ఉన్న అమర రాజా బ్యాటరీస్ సంస్థ పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తుందని నోటీసులు ఇచ్చారని, వైసీపీ నేతలు కాలుష్యం గురించి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అమర రాజా కాలుష్యం గురించి మాట్లాడుతున్న నేతలు నాసిరకం మద్యం వల్ల పాడవుతున్న ప్రజల ఆరోగ్యం గురించి ఎందుకు మాట్లాడరు అంటూ రఘురామ కృష్ణంరాజు ప్రశ్నించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+