నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వాసాలమర్రికి సీఎం కేసీఆర్.. వివరాలు ఆరా, యాదాద్రి పర్యటన

|
Google Oneindia TeluguNews

సీఎం కేసీఆర్ మరోసారి వాసాలమర్రికి వస్తున్నారు. ఆ గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం పదకొండు గంటలకు వాసాలమర్రికి చేరుకుంటారు. వాసాలమర్రిలో రైతు వేదిక భవనంలో సుమారు 130 మంది గ్రామ కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. గ్రామ అభివృద్ధిపై గ్రామ కమిటీల నుంచి సీఎం వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

‌రైతు వేదిక సమావేశం అనంతరం ఎస్సీ కాలనీలో కేసీఆర్ పర్యటిస్తారు. ఆ తర్వాత సర్పంచ్ ఇంట్లో భోజనం చేస్తారు. తర్వాత హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్‌ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేశారు. తర్వాత గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం బుధవారం గ్రామాన్ని సందర్శించనున్నారు.

cm kcr to visit vasalamarri wednesday

పర్యటనలో భాగంగా దళితవాడను సందర్శిస్తారు. 30 మంది దళితులతో సమావేశం అవుతారు. దళిత బంధు పథకం నేపథ్యంలో వీరితో భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకు ముందు జూలై 9న గ్రామ పర్యటనకు సిద్ధమయ్యారు. కానీ అనివార్య కారణాల వద్ద వాయిదా పడింది. ఈ సారి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరిస్తారు.

Recommended Video

రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్న బంగారు శ్రుతి..!!

వాసాలమర్రితో పాటు యాదాద్రిలో ఆయన ఆలయ పనులను పర్యవేక్షిస్తారు.యాదాద్రి ఆలయ పనులను వేగంగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఇదివరకే అధికారులకు స్పష్టంచేశారు. ఇటు వాసాలమర్రి అభివృద్ది పనుల పర్యవేక్షణకు సీఎం కేసీఆర్ ప్రత్యేక అధికారిని నియమించారు. యాదాద్రి జిల్లా కలెక్టర్ ప్రత్యేక అధికారిగా కొనసాగుతున్నారు. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించి కమిటీలు ఇచ్చిన జాబితా ఆధారంగా అనుమతులు ఇవ్వడంలో ప్రత్యేక అధికారి చొరవ చూపుతున్నారు.

English summary
telangana cm kcr to visit vasalamarri wednesday. discuss village development. than cm kcr visit yadadri.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X