రాజగోపాల్ రెడ్డిపై చెప్పుతో దాడి..? కాంగ్రెస్ కార్యకర్త అటాక్, అడ్డుకున్న శ్రేణులు
మునుగోడు బై పోల్ క్యాంపెయిన్ ఊపందుకుంది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులు పాట్లు పడుతున్నారు. అయితే బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రచారంలో చుక్కెదురైంది. ఓ కాంగ్రెస్ కార్యకర్త దాడి చేసేందుకు ట్రై చేశాడు. ఇదీ తీవ్ర కలకలం రేపింది. అభ్యర్థిపై దాడికి తెగబడటం చర్చానీయంశం అయ్యింది.
బీజేపీ, కాంగ్రెస్ శ్రేణులు రాళ్లు కూడా రువ్వుకుంటున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కాన్వాయ్‌లో వాహనాన్ని బీజేపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఆమె జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. బీజేపీ శ్రేణులు ఈ పని చేశారని ఆరోపించారు. దాడి గురించి ఆందోళనకు కూడా దిగారు. ఇన్సిడెంట్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఆగ్రహాన్ని నింపింది.

బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ కార్యకర్త చెప్పుతో దాడి చేసేందుకు యత్నించాడు. కోమటిరెడ్డి ప్రచారం చేస్తున్న వాహనంపైకి ఎక్కి చెప్పుతో కొట్టేందుకు ప్రయత్నించాడు. అది గమనించిన రాజగోపాల్ రెడ్డి వెనక్కి జరిగారు. వెంటనే బీజేపీ కార్యకర్తలు సదరు కాంగ్రెస్ కార్యకర్తను పక్కకు లాగిపడేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
అంతకుముందు కేసీఆర్‌పై రాజగోపాల్ రెడ్డి ఫైరయ్యారు. ఉద్యమకారుడని చెప్పుకునే కేసీఆర్ ప్రతిపక్షాలు లేకుండా చేయాలని చూస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షాలను ఎలా కొంటారని ప్రశ్నించారు. సాధు జంతువులాంటి కాంగ్రెస్ పార్టీని చంపి 12 మంది ఎమ్మెల్యేలను కొన్నారని ఆరోపించారు. అందుకే తాను పులి లాంటి బీజేపీలో చేరానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వెల్లడించారు.
-
పాపం.. అన్నామలై: అన్ హ్యాపీ- మొదటికే మోసం, పోటీకి దూరం? -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన











Click it and Unblock the Notifications