ఆట ఇప్పుడే మొదలైంది, రెండో స్థానానికి చేరాం: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
మునుగోడు బై పోల్‌లో నైతికంగా విజయం బీజేపీదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తమ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విజయం సాధించినట్టేనని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ గెలిచామని విర్రవీగుతుందని.. కానీ ఒక్క రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ పార్టీ మొత్తం మునుగోడులో తిష్ట వేసిందని తెలిపారు.
ప్రలోభాలకు గురిచేసి.. బెదిరించి మాత్రమే టీఆర్ఎస్ పార్టీ గెలిచిందని తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రులు బెదిరించారని ఆరోపణలు చేశారు. అసలైన ఆట ఇప్పుడే ప్రారంభమైందన్న కిషన్ రెడ్డి.. నియోజకవర్గంలో తమ పరిస్థితి మెరుగుపడిందని అన్నారు. డిపాజిట్ రానీ సిచుయేషన్ నుంచి.. రెండో స్థానంలో నిలిచేవరకు ఎదిగాం అన్నారు.

కాంగ్రెస్ పార్టీ కూడా టీఆర్ఎస్ విజయానికి పరోక్షంగా సహకారం అందించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేశారు. ఓడిపోయామని కృంగిపోం అని స్పష్టంచేశారు. వచ్చే ఎన్నికలో విజయం ఎలా సాధించాలనే అంశంపై కసరత్తు చేస్తామని తెలిపారు. మరోవైపు ఒక్కొ కులానికి, వర్గానికి మేలు చేస్తామని ప్రభుత్వం చెప్పింది.. చేస్తూ వచ్చింది. అదీ జనాలకు బాగా కనెక్ట్ అయ్యింది. తమ ప్రయోజనాల కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అనుకొని ఉంటారు. అందుకే రాజగోపాల్ రెడ్డిని కాదని.. ప్రభాకర్ రెడ్డికి జనం పట్టం కట్టారు. ఈ విజయంతో టీఆర్ఎస్ పార్టీ జోష్‌లో ఉంది. బీజేపీ మాత్రం టీఆర్ఎస్‌పై ఆరోపణలు గుప్పిస్తోంది.












Click it and Unblock the Notifications