రాజగోపాల్ రాజీ, అమ్ముడుబోయారని అందరికీ తెలుసు..?: మంత్రి ప్రశాంత్ రెడ్డి
మునుగోడు బై పోల్ వేళ మాటల తూటాలు పేలుతున్నాయి. మంత్రులు వర్సెస్ బీజేపీ ముఖ్య నేతల మధ్య డైలాగ్ వార్ పీక్‌కి చేరింది. ఇప్పటికే నియోజకవర్గాన్ని ప్రధాన పార్టీలు జల్లెడ పడుతున్నాయి. మునుగోడు పరిధిలో గల చౌటుప్పల్ మండలం నాగారంలో టీఆర్ఎస్ ప్రచారంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
అభివృద్ధి చేసే గుర్తు కారు అయితే...అమ్ముడుబోయిన గుర్తు కమలం గుర్తు అని సెటైర్లు వేశారు.రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది సీఎం కేసీఆరే అని కామెంట్ చేశారు.డబ్బుకు అమ్ముడుబోయిన నేతగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిలిచారని విమర్శించారు. అమ్ముడుబోయిన రాజగోపాల్ రెడ్డి లాంటి నేతలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.

కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని బీజేపీ కుట్రపూరిత రాజకీయాలు చేస్తోందని ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. 2011లో నిషేధించిన రోడ్డు రోలర్ గుర్తును తిరిగి ఎలా ఎన్నికల గుర్తుగా కేటాయిస్తారని ప్రశ్నించారు. గుర్తును తీసివేసిన కారణాన్ని చూపుతూ ఎన్నికల సంఘం తీసుకున్న
కరెక్ట్ కాదన్నారు.రిటర్నింగ్ అధికారిని మార్చిన ఈసీ వైఖరి అభ్యంతరకరం అన్నారు. మునుగోడు ప్రజలు అన్ని పరిణామాలను గమనిస్తున్నారని ప్రశాంత్ రెడ్డి అన్నారు.
మునుగోడు బై పోల్‌లో విజయం.. రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి అవసరం. ఆయన ఓడిపోతే రాజకీయ జీవితం దాదాపు క్లోజ్ అయినట్టే. అందుకోసమే ఆయన ప్రచారం కోసం అగ్రనేతలను దింపుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు అతని అనుయాయులు బిజీగా ఉన్నారు.












Click it and Unblock the Notifications