నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అధికారంలోకి వ‌స్తే మ‌హిళ‌లందరికీ ఇండ్లు, అర్హులకు పెన్ష‌న్లు: వైఎస్ షర్మిల

|
Google Oneindia TeluguNews

వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల హామీలు గుప్పిస్తున్నారు. ప్ర‌జాప్ర‌స్థానం పాదయాత్రలో భాగంగా 29వ రోజు పాద‌యాత్ర ఉమ్మ‌డి న‌ల్ల‌గొండ జిల్లా భువ‌న‌గిరి నియోజ‌క‌వ‌ర్గం పోచంప‌ల్లి మండ‌లం మార్కాండేయ న‌గ‌ర్‌లో ప్రారంభించారు. ముక్తాపూర్ గ్రామం మీదుగా చింత‌బావి గ్రామానికి యాత్ర చేరుకుంది. అక్కడినుంచి బ‌స‌వ‌లింగేశ్వ‌ర స్వామి కాల‌నీ.. రేవ‌న‌ప‌ల్లి, గౌస్ కొండ గ్రామాల మీదుగా సాగింది. అక్క‌డి నుంచి పెద్ద‌రావుల ప‌ల్లె గ్రామానికి చేరుకుంది. త‌ర్వాత బ‌ట్టుగూడ గ్రామంలో మాట-ముచ్చ‌ట కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు.

6 లక్షల మందికి రుణమాఫీ

6 లక్షల మందికి రుణమాఫీ


వైఎస్ఆర్ ముఖ్య‌మంత్రిగా ఉన్నప్పుడు 6 ల‌క్ష‌ల మంది రైతులకు రుణమాఫీ చేశారు. రైతులకు ఉచిత విద్యుత్ ప్రవేశపెట్టిన నాయకుడు వైయస్ఆర్ అని చెప్పారు. కేసీఆర్ మాత్రం మోసపూరిత హామీలు ఇస్తూ ప్రజలను దగా చేస్తున్నారని ఫైరయ్యారు. రైతులు ఏ పంట వేయాలో కేసీఆరే డిసైడ్ చేస్తున్నారని... రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఇన్సూరెన్స్ కూడా ఇవ్వడం లేదు. 3 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసి, 36 లక్షల మందికి ఎగ్గొట్టాడు. కేసీఆర్ ఒక్క మాటా నిలబెట్టుకోలేదు. దళితున్ని ముఖ్యమంత్రిని చేస్తానని.. మూడెకరాలు భూమి ఇస్తానన్నడు. డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తానన్నడు. కేసీఆర్ ను నమ్మి, ముఖ్యమంత్రిని చేస్తే బంగారు తెలంగాణ పేరుతో బారుల తెలంగాణ, బీరుల తెలంగాణ చేశాడు. వైయస్ఆర్ ఉన్నపుడు మహిళలకు పావలా వడ్డీకే రుణాలు ఇచ్చారు. కేసీఆర్ మాత్రం మహిళలకు కనీసం రుణాలు కూడా ఇవ్వడం లేదన్నారు.

 ఇంత నిర్లక్ష్యమా..?

ఇంత నిర్లక్ష్యమా..?


వందలాది మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా.. దున్నపోతు మీద వాన పడ్డట్టుగా కేసీఆర్ లో మాత్రం చలనం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల‌కు నోటిఫికేష‌న్లు వేయాల‌ని డిమాండ్ చేస్తూ ప్ర‌తి మంగ‌ళ‌వారం నిరుద్యోగ నిరాహార దీక్ష‌లు చేస్తున్నామని.. ప్ర‌జా ప్ర‌స్థానం పాద‌యాత్ర‌లో కూడా మా నిరాహార దీక్ష‌లు కొన‌సాగిస్తున్నామని వివరించారు. నిరుద్యోగులు డిగ్రీలు, పీజీలు చ‌దివి స‌మాజంలో త‌లెత్తుకోలేక , త‌ల్లిదండ్రుల‌కు భారం కాలేక ఆత్మ‌హత్య‌లు చేసుకుంటున్నారు. చ‌నిపోయిన నిరుద్యోగుల కుటుంబాల‌ను పాల‌కులు ఎవ‌రైనా ప‌రామ‌ర్శించారా? ఎంతోమంది రైతులు అప్పుల‌పాలై ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారని మండిపడ్డారు.

 అప్పుల తెలంగాణ

అప్పుల తెలంగాణ


బంగారు తెలంగాణ అని చెప్పి అప్పుల తెలంగాణ గా , ఆత్మ‌హ‌త్య‌ల తెలంగాణగా మార్చారు. ఉద్య‌మ కారుడు క‌దా అని కేసీఆర్ గారి చేతికి రాష్ట్రం అప్ప‌గిస్తే బార్ల తెలంగాణ‌గా , బీర్ల తెలంగాణ గా మార్చారు. ఈ రోజు రాష్ట్రం న‌డ‌వాలంటే మ‌ద్యం అమ్మాలి , లేదంటే భూములు అమ్ముకుంటూ పోవాలి. ఆఖ‌రికి కేసీఆర్ తెలంగాణ ప్ర‌జ‌లు, రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారు. కానీ కేసీఆర్, ఆయ‌న కుటుంబం మాత్రం స‌ల్ల‌గా ఉండాలే. ఆయ‌న కుటుంబానికి ఉద్యోగాలు , ప్ర‌జ‌ల‌కేమో ఆత్మ‌హ‌త్య‌లా? అని ప్రశ్నించారు. కాళేశ్వ‌రం లాంటి పెద్ద‌పెద్ద ప్రాజెక్టులు చేయాలే.. ఆ క‌మీష‌న్లు తినాలే వాళ్లు మాత్రం బాగుండాలి. తెలంగాణ ప్ర‌జ‌లు మాత్రం ఆత్మ‌హ‌త్య‌లు చేసుకోవాలా? ఇప్పుడు కేసీఆర్ కు రెండుసార్లు అధికారం ఇస్తే ఏం చేశారు? రాష్ట్రంలో కేసీఆర్ మోసం చేయ‌ని వ‌ర్గం లేదన్నారు. రుణ‌మాఫీ చేస్తాన‌ని రైతుల‌ను మోస‌గించారు.ఎస్టీల‌కు పోడు ప‌ట్టాలు ఇస్తామ‌ని మోసం చేశారు.

English summary
if ysrtp take power in the state, all women get home party chief ys sharmila said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X