సూర్యాపేట గ్యాలరీకి ఏ ప్రతిపాదికన అనుమతులు.. ఉత్తమ్ ప్రశ్న

సూర్యాపేటలో జాతీయ స్థాయి కబడ్డీ ప్రారంభోత్సవంలో అపశృతి జరిగింది. 3 నంబర్ గ్యాలరీ కుప్పకూలడంతో చాలా మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పందించారు. ఇంతమంది గాయపడడం బాధాకరం అన్నారు. గ్యాలరీకి ఏ ప్రతిపాదికన అనుమతులు ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యసదుపాయాలు అందించాలని కోరారు.

సూర్యాపేట ప్రమాదంలో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నట్లు సమాచారం. ఒక్కసారిగా కూలడంతో అందరూ ఉలిక్కి పడ్డారు. 47వ జాతీయ కబడ్డీ ఛాంపియన్‌షిప్‌ ప్రారంభమైన కాసేపటికే ఈ ఘటన జరిగింది. జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు స్టేడియంలో మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు.

tpcc chief uttamkumarreddy saddened suryapet incident

ఈ ఘటనతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు. స్టేడియం గ్యాలరీలో సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఘటనపై దర్యాప్తు కూడా చేస్తున్నారు. ప్రమాదంపై ఉత్తమ్ స్పందించారు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఘటన జరిగిందని వివర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+