Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీఆర్ఎస్, కాంగ్రెస్ డిష్యుం డిష్యుం.. రాళ్ల దాడులతో హీటెక్కిన ప్రచారం

సూర్యాపేట : అధికార పార్టీ టీఆర్ఎస్, ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య రాజకీయ వైరం కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు ప్రోత్సహిస్తున్నారని గుర్రుగా ఉన్నారు ఆ పార్టీ లీడర్లు. ఆ క్రమంలో రెండు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. అయితే తాజాగా ఎన్నికల ప్రచారంలో అది కాస్తా భౌతికదాడులకు దారితీస్తోంది. పరిషత్ ఎన్నికల ప్రచారంలో ఇరు పార్టీల కార్యకర్తలు కొట్టుకుంటుండటం చర్చానీయాంశమైంది.

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని చింతలపాలెం మండలం పీక్లా నాయక్ తండాలో.. టీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మూడో విడత పరిషత్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ గ్రామానికి వచ్చారు. అయితే ఉత్తమ్ ను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ కార్యకర్తలు ప్రయత్నించడం వివాదస్పదమైంది.

trs congress cadre street fight in nalgonda district

దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు టీఆర్ఎస్ శ్రేణులను చితకబాదారు. దానికి ప్రతీకారంగా కాంగ్రెస్ కార్యకర్తలపై టీఆర్ఎస్ వర్గీయులు రాళ్లతో దాడి చేశారు. పరస్పర దాడుల కారణంగా ఇరు పార్టీల కార్యకర్తలకు గాయాలయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+