నల్గొండ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బొమ్మల రామారంలో టెన్షన్ టెన్షన్.. సైకో శీనుగాడి బాధిత కుటుంబాల నిరాహార దీక్ష

|
Google Oneindia TeluguNews

నల్గొండ : నరరూప రాక్షసుడు, హాజీపూర్ సీరియల్ కిల్లర్ శ్రీనివాస్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. అభం శుభం తెలియని అమ్మాయిలను అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేశాడు. శ్రావణి హత్యోదంతంతో వెలుగుచూసిన సైకో శీనుగాడి లీలలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపాయి.

బొమ్మల రామారం మండలంలోని హాజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలపై హత్యాచారాలు చేశాడు సైకో శీనుగాడు. అంతకుముందు ఓ మహిళను చంపాడు. పోలీసుల దర్యాప్తులో నలుగుర్ని అత్యాచారం చేసి చంపినట్లు ఒప్పుకున్నాడు. అయితే వరంగల్ జైలులో రిమాండు ఖైదీగా ఉన్నాడు. బాధిత కుటుంబాలు మంత్రులను కలిసి న్యాయం చేయాలని కోరినా.. ఇంతవరకు ఎలాంటి స్పందన లేకపోవడం గమనార్హం. ఆ క్రమంలో బొమ్మల రామారంలో శ్రావణి తల్లిదండ్రులు నిరాహార దీక్షకు దిగడంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.

గ్రామస్తుల ఆగ్రహం

గ్రామస్తుల ఆగ్రహం

సైకో శీనుగాడి పంజాతో హాజీపూర్‌కు చెందిన ముగ్గురు అమ్మాయిలు బలయ్యారు. హత్యాచారాలు చేస్తూ ఏమీ తెలియనట్లుగా తమ మధ్యనే తిరిగిన శ్రీనివాస్ రెడ్డిపై గ్రామస్తులు కోపం పెంచుకున్నారు. ఆ క్రమంలో వాడి ఇల్లు తగులబెట్టారు. కనిపిస్తే కొట్టి చంపాలనే కసితో ఉన్నారు. అయితే కేసులో భాగంగా శ్రీనివాస్ రెడ్డి వరంగల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇటీవల 5 రోజుల కస్టడీకి తీసుకున్న రాచకొండ పోలీసులు.. వాడి నుంచి నిజాలు కక్కించే ప్రయత్నం చేశారు. అయితే ఆ నాలుగు హత్యల గురించి తప్ప నోరు విప్పలేదనే టాక్ నడుస్తోంది.

మంత్రులను కలిసినా నో యూజ్

మంత్రులను కలిసినా నో యూజ్

సైకో శీనుగాడి ఉదంతం బయటపడ్డాక.. గ్రామస్తులు వాడిని ఉరి తీయాలంటూ డిమాండ్ చేశారు. న్యాయం జరిగేంత వరకు పోరాడతామని హెచ్చరించారు. ఆ క్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో హోం మినిస్టర్ మహమూద్ అలీతో పాటు మరో మంత్రి ఈటల రాజేందర్‌ను కలిసి న్యాయం చేయాలని కోరారు. ఆ మేరకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి.. నిందితుడికి శిక్ష పడేలా చేస్తామని మంత్రులు హామీ ఇచ్చారు. అయితే అది ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.

సీరియల్ కిల్లర్‌ను జైల్లో కూర్చోబెడతారా?

సీరియల్ కిల్లర్‌ను జైల్లో కూర్చోబెడతారా?


సైకో శీనుగాడి వికృత చేష్టలపై రగిలిపోతున్న గ్రామస్తులు.. వాడికి సరైన శిక్ష వేయాలంటూ పట్టుబడుతున్నారు. మంత్రులను కలిసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో.. వారిలో కోపం మరింత కట్టలు తెంచుకుంటోంది. అభం శుభం తెలియని బాలికలపై హత్యాచారాలు చేస్తే.. తీసుకెళ్లి జైలులో కూర్చోబెడతారా అంటూ ప్రశ్నిస్తున్నారు. సైకో శీనుగాడికి ఉరిశిక్ష సరైన శిక్ష అంటున్నారు.

శీనుగాడి లీలలు బయటపడ్డాకా గ్రామస్తులు ఏకతాటిపై నిలిచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆ మేరకు హాజీపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు కూడా తలెత్తాయి. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినా కూడా.. నిందితుడి ఇల్లు తగులబెట్టారు. అంతటి కసితో రగలిపోయిన గ్రామస్తులు.. ఇన్ని రోజులు న్యాయం జరుగుతుందని చూశారు. చివరకు ఎలాంటి న్యాయం జరగడం లేదని భావించి రోడ్డెక్కారు.

రోడ్డెక్కిన బాధితులు.. నిరాహార దీక్ష

రోడ్డెక్కిన బాధితులు.. నిరాహార దీక్ష

సైకో శీనుగాడికి సరైన శిక్ష వేసి సత్వర న్యాయం చేయాలని కోరుతూ మంత్రులను కలిసినా కూడా లాభం లేకుండా పోయిందని గ్రామస్తులు ఆగ్రహంతో ఉన్నారు. ఆ క్రమంలో బొమ్మల రామారం మండల కేంద్రంలో సైకో శీనుగాడిని ఉరి తీయాలంటూ శ్రావణి తల్లిదండ్రులు నిరాహార దీక్షకు దిగారు. తమకు న్యాయం జరిగేలా వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వాడికి శిక్ష ఖరారు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

English summary
Nalgonda District Bommala Ramaram Mandal Hazipur Serial Killer Victims Protesting for Judgement. The Victims demanding that to appoint fast track court for immediate action againt saiko seenu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X