నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫేక్ ఈడీ ముఠా కలకలం.. నెల్లూరు జువెల్లరీ షాపులో తనిఖీ

|
Google Oneindia TeluguNews

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్.. ఈడీ, కంపెనీల డొల్లతనం బయటపెడుతుంటాయి. రైడ్స్ చేస్తుంటాయి. ఇటీవల వరసగా రైడ్స్ చేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే కొందరు ఈడీ పేరు కూడా అడ్డంగా పెట్టుకుంటున్నారు. అవును మీరు చదువుతుంది నిజమే.. అదీ కూడా మన తెలుగు రాష్ట్రంలో.. ఆంధ్రప్రదేశ్‌‌లో ఫేక్ ఈడీగాళ్లు దొరికారు.

నెల్లూరులో ఈడీ అధికారుల ముఠా హల్‌చల్‌ చేసింది. కాకర్లవారి వీధిలో నగల దుకాణంలోకి ఎనిమిది మంది సభ్యుల ముఠా వచ్చింది. తిరుపతి, బెంగళూరు నుంచి తనిఖీలకు వచ్చామని తనిఖీలు చేసింది. జ్యూవెల్లరీ షాపు షట్టర్లు మూసేసి తనిఖీలు చేశాక.. బంగారాన్ని కారులో తీసుకెళ్తున్న సమయంలో యజమానికి అనుమానం వచ్చింది.

 fake ed gang arrested at nellore

అధికారులు అంటూ వచ్చినవారిని గట్టిగా నిలదీశారు. నెల్లూరు బులియన్‌ అసోషియేషన్‌కు సమాచారం ఇచ్చారు. దీంతో వారొచ్చి నిలదీసేసరికి నకిలీ అధికారుల ముఠా తడబడింది. ఈడీ అధికారులు అంటూ షాపులోకి వెళ్లి కోటి 50 లక్షల రూపాయల విలువ చేసే బంగారం పట్టుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ నకిలీ మఠాను అడ్డుకుని జ్యూయల్లరీ యజమాని సునీల్, బులియన్‌ అసోషియేషన్ ప్రతినిధులు దేహశుద్ధి చేశారు. నకిలీ అధికారుల ముఠాను అరెస్ట్‌ చేశారు.

ఇటీవల వస్తోన్న వార్తలను ఆసరాగా చేసుకొని ఆ ముఠా తెగబడింది. కానీ ఆ యాజమాని చాకచక్యంగా వ్యవహరించడంతో.. మోసం బారి నుంచి బయటపడ్డాడు. లేదంటే భారీగా మోసపోయేవారు.

English summary
fake ed gang arrested at nellore. they build up as officials but shop owner catches
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X