రోహింగ్యాలకు పాస్ పోర్టా..? ఉద్యమిస్తాం, అర్వింద్ స్పష్టీకరణ
రోహింగ్యాలకు పాస్ పోస్టు అంశంపై ఉద్యమిస్తామని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. ఈ అంశంపై కేంద్రం ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని చెప్పారు. శుక్రవారం ఆయన నిజామాబాద్ ఆదర్శ్ నగర్‌లో చత్రపతి శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దొంగ పాస్‌పోర్టుల వ్యవహారంపై సీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రోహింగ్యాలకు పాస్‌పోర్టుల జారీ అంశంపై కేంద్ర హోంశాఖకు లేఖ రాశామని తెలిపారు. వారికి పాస్ పోర్టు జారీ అంశాన్ని అంత తేలికగా వదలబోమని చెప్పారు. దీనిపై ఎన్ఐఏ ద్వారా విచారణ జరిపిస్తామని అర్వింద్ ప్రకటించారు. హైదరాబాద్ పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అర్వింద్ కామెంట్స్ ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రోహింగ్యాలు ఉన్నారని బీజేపీ నేతలు కూడా ఆరోపిస్తున్నారు. కానీ దీనిపై అధికార టీఆర్ఎస్ పార్టీ తప్పుపడుతోంది. అలాంటి వారెవరూ లేరని చెబుతూ వస్తోంది.

ఈ సారి ఏకంగా రోహింగ్యాల పాస్ పోర్టు అంశాన్ని బీజేపీ ఎంపీ అర్వింద్ ప్రస్తావించడం విశేషం. మరీ దీనిపై టీఆర్ఎస్ పార్టీ నుంచి కౌంటర్ ఏ విధంగా వస్తుందో చూడాలీ. టీఆర్ఎస్- మజ్లిస్ కలిసి రోహింగ్యాలను వెనకెసుకు వస్తున్నారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే అర్వింద్ రోహింగ్యాలకు పాస్ పోర్ట్ అనే అంశాన్ని ప్రస్తావించారు.
-
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక












Click it and Unblock the Notifications