Oneindia Exclusive:'అమ్మ ఇచ్చిన స్వేచ్ఛతోనే రాణించాం' అంటున్న మహిళల మనోగతం
స్వేచ్ఛ, సమానత్వం, హక్కు వీటన్నింటి గురించి ఆమెకు తెలుసు. అయినా అయినవాళ్ల సంతోషాల కోసం సర్దుకుపోతుంది. ప్రపంచమే తనపై ఆధారపడిందని, తానే భవిష్యత్తు తరాలకి వారధి అని తెలిసి కూడా స్త్రీ ఏనాడు గర్వపడదు. ఏదో సాధించాలనే తపన ఉన్నా, భర్త కోసం, కుటుంబం కోసం, సమాజం కోసం సర్దుకుంటూ, త్యాగాన్ని ఆశ్రయిస్తూ, ప్రేమను పంచే గొప్ప మనసు స్త్రీకి మాత్రమే ఉంది. స్త్రీ స్వేచ్ఛకు, హక్కులకు సంకెళ్లు వేసే పరిస్థితిని మార్చేందుకు, మహిళ ఔనత్యాన్ని గుర్తుచేస్తూ, అనుకున్నది సాధించే స్ఫూర్తిని కలిగించేందుకు ఏటా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. కుటుంబం చీకూచింతా లేకుండా హాయిగా సాగుతోందన్నా, ఒడిదొడుకులు వచ్చిన ప్రతిసారి, నిలబడి ముందుకు వెళ్తోందన్నా, ఆ వెనక స్త్రీ ఉనికి ఉంటుందనేది యథార్థం. ఈ మహిళా దినోత్సవం రోజున వన్ ఇండియా ప్రత్యేక కథనంతో ముందుకు వచ్చింది.
Recommended Video

స్వేచ్ఛ-దశాబ్దాల క్రితం నుంచి మొదలు, నేటివరకూ మహిళలకు అందీ అందనట్లు ఊరిస్తోంది.నచ్చినట్లు ఉండాలన్నా, నచ్చిన నిర్ణయం తీసుకోవాలన్నా, ఏం చేయాలన్నా..సరే స్వేచ్ఛతోనే ముడి పడి ఉంది. తరాలు మారుతున్న కొద్దీ ప్రతి కుటుంబంలో మహిళలకు స్వేచ్ఛ పెరుగుతూ రావడం ఎంతో సంతోషించే విషయం.
దీనికి కారణం అమ్మే. స్వేచ్ఛని పరిచయం చేసేది. స్వేచ్ఛ అంటే తెలిపేది అమ్మే.అమ్మ పొత్తిళ్ల నుంచి, అమ్మే స్వయంగా బిడ్డకు కల్పించేదే స్వేచ్ఛ.

సమాజాన్ని అమ్మ కళ్లతో చూడటం నుంచి మొదలుకొని, మన కళ్లతో చూసి, తెలుసుకొని, సమాజ నడవడిని గమనించి, మసలుకునే వరకు ప్రతి విషయంలోనూ, ప్రతి అడుగులోనే అమ్మ కల్పించే స్వేచ్ఛే ప్రధానం. అమ్మ కోల్పోయిన స్వేచ్ఛఅమ్మ ఈరోజున మనకు ఇస్తున్న స్వేచ్చను, అమ్మ యువతిగా ఉన్న రోజుల్లో అనుభవించలేదు. తాను కోల్పోయిన స్వేచ్ఛకు రెట్టింపు తన కూతురికి ఇవ్వాలని తహతహలాడింది. అందుకే నచ్చిన పని చేయడంలో స్వేచ్ఛనిచ్చింది.నచ్చినట్లు ఉండటంలో స్వేచ్ఛనిచ్చింది. అమ్మ ప్రోత్సాహంతో, అమ్మ ఇచ్చిన స్వేచ్ఛతో వివిధ రంగాల్లో ముందుకు సాగుతున్న మహిళలు వన్ ఇండియాతో తమ అభిప్రాయాలను ప్రత్యేకంగా పంచుకుంటున్నారు. స్వేచ్ఛని ఇచ్చిన అమ్మకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.












Click it and Unblock the Notifications